the website
-
వెబ్సైట్లో గోల్డ్ మెడల్ విజేతల పేర్లు
నల్లగొండ టూటౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో 2011–12 నుంచి 2015–16 వరకు వివిధ సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు పొంది బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల పేర్లు కళాశాలwww.ngcnalgonda. org వెబ్సైట్ లో పెట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. నాగేందర్‌రెడ్డి మంగళవారంఓ ప్రకటనలో తెలి పారు. విద్యార్థులు ఈనెల 22న జరిగే కళాశాల వజ్రోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఈ వేడుకలకు మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 98490 56316లో సంప్రదించాలని కోరారు. -
ఓటేద్దాం..పదండి..!
సిటీబ్యూరో: ‘స్థానిక సంస్థకు ప్రజాప్రతినిధుల ను ఎన్నుకునే కీలక సమయం వచ్చింది. సెల విచ్చారు కదా అని బద్ధకించకండి. మీ చేతిలోని వజ్రాయుధాన్ని వినియోగించండి’ అని చెబుతున్నారు ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ అధికారులు. స్వచ్ఛంద సంస్థ లూ ఇదే మాట చెబుతున్నాయి. గతంలో పోలింగ్ కేం ద్రం ఎక్కడో తెలియదనే బాధ ఉండేది. ఇప్పుడా దుస్థితి లేదు. వెబ్, మొబైల్ ద్వారా వివరాలు తెలుసుకునే సదుపాయం ఉంది. వాటి ద్వారా వివరాలు పొంది.. కాగితం మీద రాసుకొని వెళ్లినా సరిపోతుంది. అదీ కుదరకుంటే పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు వివరాలు తెలిపే సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంకెందుకు ఆలస్యం? కదలండి. వెబ్సైట్ ద్వారా ఇలా ఓటరు స్లిప్ పొందవచ్చు ఎపిక్ కార్డు లేని పక్షంలో సర్కిల్, వార్డులను సం బంధిత కాలమ్‌లలో భర్తీ చేశాక డోర్ నెంబరు, పే రు వివరాల్లో ఏ ఆప్షన్‌ను తీసుకున్నా సరిపోతుం ది. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు తెలిస్తే ఇంకా మంచిది.ఓటరు జాబితాలో కచ్చితంగా ఏపేరు ఉందో తెలిస్తే... ఆ ఆప్షన్‌పై టిక్ చేసి స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి.లేని పక్షంలో పేరులోని తొలి అక్షరాలు కొన్ని నమోదు చేసినా వాటితో ప్రారంభమయ్యే ఓటర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో కావాల్సిన వారి పేరు, వివరాలు చూసుకోవాలి.ఎవరి ఓటరు స్లిప్ కావాలో ఆ పేరు వరుసలో ఉన్న ‘ప్రింట్ ఓటరు స్లిప్’పై క్లిక్ చేస్తే వార్డు నెంబరు, పోలింగ్ స్టేషన్ నెంబరు, లొకేషన్, ఓటరు జాబితాలో సీరియల్ నెంబర్, పేరు, తండ్రి/ భర్త పేరు, వయసు, లింగం, ఎపిక్ నెంబరు వివరాలతో స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. లేదా సేవ్ చేసుకొని తర్వాత ప్రింట్ తీసుకోవచ్చు. వివరాలు రాసుకున్నా చాలు. పోలింగ్ కేంద్రంలో చెబితే త్వరితంగా ఓటు వేయవ చ్చు నగర ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు ఈ స దుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి కోరారు. యాప్ ద్వారా ఇలా.. ఆండ్రాయిడ్ సదుపాయం కలిగిన స్మార్ట్ఫోన్ల ద్వారా దిగువ పేర్కొన్న విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాలి.సెర్చ్‌లో టీఎస్ఈ సీ ఓటర్ అని టైపు చేస్తే ‘టీఎస్ ఎలెక్షన్ఓటరు స్లిప్’ అనే యాప్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి.యాప్‌ను ఓపెన్ చేస్తే ఎపిక్ / ఓటరు ఐడీ స్క్రీన్ వస్తుంది. దాన్లో ఎపిక్ నెంబరు ఎంట్రీ చేస్తే ఓటరు స్లిప్ వస్తుంది. ఈ వివరాలను సేవ్ చేసుకోవచ్చు. -
వాట్సాప్ ఇక ప్రపంచవ్యాప్తంగా ఉచితం
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ఇక ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా వాడుకోవచ్చు. ఏడాదికి వసూలు చేస్తున్న ఒక డాలరు ఫీజును రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ సోమవారం తన వెబ్సైట్లో తెలిపింది. ఆదాయం కోసం థర్డ్ పార్టీల నుంచి ప్రకటనలను కూడా ప్రవేశపెట్టబోమని పేర్కొంది. వాట్సాప్‌ను వాడుకున్న తొలి ఏడాది తర్వాత ఫీజు చెల్లించాలని కొంతమంది యూజర్లను అడుగుతున్నామని, అయితే తాము విస్తరించడంతో, అది అమల్లో సాధ్యం కావడం లేదని తేలినట్లు వెల్లడించింది. తమ యాప్‌కు సంబంధించిన వివిధ వెర్షన్లపై ఫీజును రానున్న వారాల్లో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్ భారత్‌లోని యూజర్ల నుంచి ఫీజు వసూలు చేయడం లేదు. కాగా, ప్రకటనల్లేకుండా తమ సర్వీసు అందించేందుకు కొన్ని టూల్స్‌ను పరీక్షిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తమ యాప్ ద్వారా యూజర్లు వ్యాపారులతో, బ్యాంకులు తదితర సంస్థలతో సంప్రదింపులు నెరపడానికి టూల్స్‌ను ఈ ఏడాది నుంచి పరీక్షిస్తామని పేర్కొంది. -
తప్పిపోయిన పిల్లల కోసం వెబ్సైట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పిపోయిన పిల్లల కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంగళవారం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్, శిశుసంక్షేమ మంత్రి మేనకాగాంధీ సంయుక్తంగా ‘‘ఖోయా-పాయా’’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. పౌరులు తమకు ఎవరైనా తప్పిపోయిన పిల్లలు కనిపించినా, అనుమానాస్పద వ్యక్తులతో పిల్లలు కనిపించినా ఈ వెబ్సైట్ ద్వారా తెలపొచ్చు. ట్రాక్ చైల్డ్ పేరుతో ఇప్పటికే వెబ్సైట్ ఉన్నా అది పోలీసులకు ఉద్దేశించిందని, ఈ కొత్త వెబ్సైట్లో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వాములు కావచ్చని.. సమాచారాన్ని అప్లోడ్ చేయవచ్చని మేనకాగాంధీ తెలిపారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం ఏడాదికి సగటున 70 వేల మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు. -
సర్వం సిద్ధం
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు కేంద్రాల వద్ద 144 సెక్షన్ వెబ్సైట్లోనూ హాల్‌టికెట్లు విద్యారణ్యపురి : జిల్లాలో ఈ నెల 9 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 1,04,381 మంది హాజరుకానున్నారు. 9న ప్రారంభం కానున్న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 48,874 మంది, 10న మొదలయ్యే సెకండియర్ పరీక్షలకు 55,507 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లావ్యాప్తంగా 131 పరీక్ష కేంద్రాలు కేటారుుంచారు. ఇందులో 62 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కాగా... 69 ప్రభుత్వ, ఇతర రెసిడెన్షియల్ , ఎయిడెడ్ కాలేజీలు ఉన్నారుు. సుమారు 5 వేల మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. 131 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు(సీఎస్), డిపార్టుమెంటల్ ఆఫీసర్లను( డీఓ) నియమించారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్‌లతోపాటు పది సిట్టింగ్ స్క్వాడ్లను నియమాకం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్ఐ, సీనియర్ లెక్చరర్లు సభ్యులుగా ఉన్నారు. సిట్టింగ్ స్క్వాడ్ ఒక్కో బృందంలో సీనియర్ లెక్చరర్‌తోపాటు పీడీ లేదా లైబ్రేరియన్ ఉన్నారు. అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లను కూడా నియూమకం చేశారు. ఉన్నతస్థారుులో పర్యవేక్షణకు హైపవర్ కమిటీ నియూమకమైంది. ఇందులో జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఇంటర్‌విద్య ఆర్జేడీ, డీవీఈఓ ఉన్నారు. పరీక్షల షెడ్యూల్.. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు 27వ తేదీ వరకు కొనసాగనున్నారుు. ఆయా పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరగనున్నారుు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు ఉదయం 8.30 గంటల కల్లా చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా కళాశాలలు ప్రిన్సిపాళ్లు తీసుకెళ్లారని, ఈ మేరకు వాటిని తీసుకుని పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. వెబ్సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లను తీసుకోవచ్చని వెల్లడించారు. పరీక్షల నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా, పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధించకుండా సంబంధిత అధికారులతో ఇంటర్ విద్య ఆర్ఐఓ మాట్లాడారు. ఇటీవల కలెక్టరేట్లో వివిధ శాఖాధికారులతో కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సంబంధిత అధికారులకు కూడా ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షల సమయంలో మూసివేయాలని అధికారులు ఆదేశించారు. సమస్యాత్మక కేంద్రాలు 23 జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి సమస్యాత్మక కేంద్రాలు 23 ఉన్నట్లు గుర్తించిన అధికారులు... వీటిపై ప్రత్యేక దృష్టిసారించారు. కాపీయింగ్ నిరోధానికి చర్యలు తీసుకున్నారు. ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీ(కురవి), ఏపీఎస్డబ్ల్యూజేసీ (మహబూబాబాద్), జీజేసీ(బి)(మహబూబాబాద్), ప్రిస్టన్ జూనియర్ కాలేజీ (జనగామ), ప్రభుత్వ జూనియర్ కాలేజీ(పరకాల), తేజస్విని గాంధీ జూనియర్ కాలేజీ (భూపాలపల్లి), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (భూపాలపల్లి, మద్దూరు, చేర్యాల, నెక్కొండ), పోతన కో ఆపరేటివ్ జూనియర్ కాలేజీ (పాలకుర్తి), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (కేసముద్రం, గూడూరు, కొత్తగూడెం,నర్మెట, చిట్యాల, దేవరుప్పుల, కొడకండ్ల, జఫర్‌గఢ్ సెంటర్లు సమస్యాత్మక కేంద్రాల జాబితాలో ఉన్నారుు. కాగా, జిల్లాలో మూడు సెల్ఫ్ సెంటర్లు ఏర్పాటుచేశారు. ఇందులో ధర్మసాగర్, మంగపేట, తాడ్వారుు ప్రభుత్వ నియర్ కాలేజీలు ఉన్నాయి. -
వెబ్సైట్లో ఇంగ్లిషు పాఠాలు
మనోహర్ మరో ప్రయత్నం ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం సీతంపేట : తనకున్న ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పదిమందికీ ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో 24 సంవత్సరాలుగా స్పోకెన్ ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్న మనోహర్ ఇప్పుడు వెబ్సైట్ ద్వారా సేవలందిస్తున్నారు. ఆయన మధురానగర్ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఇప్పటివరకు సుమారు 23 వేల మందికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నత పదవుల్లో చేర్చిన ఘనత దక్కించుకున్నారు. కేవలం 30 రోజులలో అవలీలగా ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దే నైపుణ్యం మనోహర్ మాస్టారి సొత్తు. తను రూపొందించిన స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును సులభ మార్గాన్ని మరింతమందికి చేరువ చేసేందుకు manoharspokenenglish.com పేరిట వెబ్ సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. వీడియో గాలరీలో రెండు గంటల నిడివి గ ల వీడియో పాఠాలను వెబ్సైట్లో పొందుపర్చారు. ఎవరైనా ఉచితంగా వెబ్ సైట్ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకునే వీలు కల్పించారు మనోహర్ మాస్టారు. అంతేకాదు ఉచితంగా డౌన్ లోడ్చేసుకునే సదుపాయం కూడా ఉంది. వెబ్ సైట్లో ఏముంది... ఇంగ్లిష్ సులభంగా మాట్లాడేందుకు అవసరమైన 300 సింపుల్ వెర్బ్స్, నాలుగు చాప్టర్ల గ్రామర్‌ను పొందుపర్చారు. గ్రామర్‌లో స్రక్చర్స్, సింపుల్ ప్రెజెంటెన్స్, ప్రెజెంట్ కంటిన్యువస్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అనే నాలుగు టెన్స్‌లు, వాటిని 300 వెర్బ్స్తో ఎలా ఉపయోగించి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చునో వీడియోలో వివరించారు. నిత్యజీవితంలో ఉపయోగించే సంభాషణలతో వీడియోను పొందుపరిచారు. మరింత చేరువ కావాలని... ప్రపంచం మాట్లాడే భాష ఇంగ్లిష్. ఇంగ్లిష్ అంటే చాలా మందికి భయం. మాట్లాడటం రాక ఉద్యోగాాలను చేజార్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. నేటి సమాజంలో విద్య, వ్యాపారం,ఉద్యోగంలో రాణించాలంటే ఇంగ్లిష్‌లో మాట్లాడటం తప్పనిసరైపోయింది. ఎంఎన్సీ కంపెనీలలో కొలువు కావాలన్నా, ఆఖరికి ఇంటిలో పిల్లలకు చదువుచెప్పాలన్నా గృహిణులకు ఆంగ్లంలో మాట్లాడటం అవసరమైంది. ఇలాంటి వారిలో భయాన్ని పోగొట్టి కేవలం 30 రోజులలో ఇంగ్లిష్‌లో మాట్లాడేలా పుస్తకాన్ని, డీవీడీ రూపొందించాను. 1991 నుంచి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. ఈ సులభమైన పద్ధతి మరింతమందికి చేరువ కావడానికి సంఘమిత్ర సర్వీసెస్ ద్వారా మనోహర్ స్పోకెన్ ఇంగ్లిష్ డాట్ కామ్ వెబ్ సైట్‌ను అందుబాటులోకి తెచ్చాను. - దామోదల మనోహర్, జీవీఎంసీ ఉపాధ్యాయుడు, సీతంపేట -
అమ్మేవి పుస్తకాలు.. కొనేవి ఫోన్లు
ఓఎల్ఎక్స్... ఇటీవల వినియోగదారులను తనవైపు తిప్పేసుకున్న వెబ్సైట్. పాత వస్తువులకు కొత్త గిరాకీని తెచ్చిపెట్టిన ఈ సంస్థ... పాత వస్తువులను అమ్మడంలో, కొనడంలో భారతీయుల ఆలోచనా విధానమెలా ఉందనే అంశంపై ఈ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. అందులో బయటపడ్డ కొన్ని అంశాలు... భారతీయులు తాము వాడిన వస్తువులను అమ్మడానికి ఎక్కువ ఇష్టపడటం లేదు. ఇందుకు వాటితో ఉన్న అనుబంధం కారణమైతే.. ఇంకొన్ని రోజులు వాడితే పోలా అనే యాటిట్యూడ్ మరో కారణం. అయితే ఈ విషయంలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. 48 శాతం అమ్మకాలతో ఉత్తర భారతీయులు ముందంజంలో ఉండగా.. ఈశాన్య రాష్ట్రాల వాసులు తమ వస్తువులు అమ్మడానికి ఇష్టపడటం లేదు. ఈ అమ్మకాలు.. కొనుగోళ్లలో ముంబై వాసులు ముందంజలో ఉండగా... దిల్లీవాసులు ద్వితీయ స్థానానికి చేరుకున్నారు. ఇంట్లో ఏదైనా వ స్తువును అమ్మాలంటే హోం మేకర్‌దే నిర్ణయం. ఇక హైదరాబాదీ ఇళ్లలో సగటున రూ.8,400 విలువ చేసే వాడని వస్తువులు ఉంటున్నాయట. నగరంలో పాత వస్తువుల అమ్మకం నిర్ణయం 45 శాతం ఇళ్లలో మహిళలపైనే ఆధారపడి ఉంటోంది. వాళ్ల ఇష్టాయిష్టాల మేరకే అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. నగరవాసులు అమ్మడానికి ఇష్టపడనివి కిచెన్ అప్లయన్సెస్. ఎక్కువగా అమ్ముతున్నవి పుస్తకాలు. ప్రధానంగా... కొత్తవి, ఇంకొంచెం ఆధునికమైనవి కొనాలనే ఆకాంక్షతో పాత వస్తువులను అమ్మేస్తున్నారట నగరవాసులు. ఇంట్లో పడి ఉన్నాయికదా అని అమ్మేసేవారూ ఉన్నారు. కొనుగోళ్ల విషయానికి వస్తే... మొబైల్స్ ఇతర డ్యూరబుల్ ఐటెమ్స్ కొనేందుకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నవారూ ఉన్నారు. తక్కువ ఖరీదులో మంచి వస్తువులు దొరుకుతున్నాయి కాబట్టి వీటిని కొంటున్నామంటున్నారు. సాక్షి, సిటీప్లస్ -
పెళ్లి ప్రకటనే పెట్టుబడి
వరుడు కావాలని ప్రొఫైల్ క్రియేట్ చేసిన వివాహిత ఎన్ఆర్ఐనని నమ్మించి రూ.35 లక్షలు కాజేత సీీసీఎస్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన నిందితురాలు సిటీబ్యూరో: ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మోసానికి పాల్పడింది. సీసీఎస్ డీసీపీ పాలరాజు కథనం మేరకు..బేగంపేటకు చెందిన మాలవిక (32)కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి కోసం వరుడు కావాలని మ్యాట్రిమోని డాట్ కామ్ వెబ్సైట్లో త న తప్పుడు ప్రొఫైల్‌ను పెట్టింది. చిన్న పిల్లల వైద్యురాలినని.. ప్రొఫైల్‌లో ‘తాను అమెరికాలో పుట్టాను. ఇండియాలో అమ్మమ్మ చనిపోవడంతో తాతయ్య ఆరోగ్యం చూసుకునేందుకు వచ్చాను. తాను చిన్న పిల్లల నిపుణుల డాక్టర్ని, నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తాను. ఇంకా పెళ్లి చేసుకోలేదు. వరుడు కావలెను. నాకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయని’ పేర్కొంది. ట్రాప్‌లో పడ్డ ఎన్ఆర్ఐ ఆమె ప్రొఫైల్‌ను చదివి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు జి.ప్రశాంత్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. ప్రేమలో పడ్డ అతగాడు ప్రతిరోజు సెల్‌ఫోన్, ఇంటర్నెట్లో వీడియో చాట్ చేసేవాడు. తన అవసరాల నిమిత్తం కొంత డబ్బు కావాలని కోరడంతో ఆమె అకౌంట్లోకి విడతల వారీగా మొత్తం రూ.35 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక పెళ్లి చేసుకునేందుకు గత నవంబర్‌లో ప్రశాంత్ ఇండియాకు రావడంతో ఆమె గుట్టు రట్టు అయ్యింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై చీటింగ్ కేసు నమోదైంది. అయితే ఆమె మకాం మార్చడంతో పోలీసులకు దొరకలేదు. దర్యాప్తులో భాగంగా ఆమె ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు కనుగొన్నారు. విచారణ నిమిత్తం సీసీఎస్‌కు రావాలని పోలీసులు కోరారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆమె సీసీఎస్ కార్యాలయం వద్దకు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆమె బ్యాగ్‌లో సూసైడ్ నోట్ లభించింది. అందులో..తన పరువు పోయిందని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటుంది. -
ఆన్లైన్ యోచన విరమించుకోవాలి
దస్తావేజు లేఖర్ల సమ్మె కడప సెవెన్‌రోడ్స్ : స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో ఇకమీదట ఆన్లైన్ పద్ధతి తీసుకు రావాలన్న ప్రభుత్వ యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని దస్తావేజు లేఖర్లు శుక్రవారం సమ్మెలోకి వెళ్లారు. డాక్యుమెంట్‌రైటర్ల ప్రమేయం లేకుండా ఎవరికి వారు స్వంతంగాఆన్లైన్లో దరఖాస్తు పొంది కావాల్సిన తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానాన్ని ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సేల్ డీడ్, గిఫ్డ్ డీడ్ తదితరాలకు అవసరమైన డాక్యుమెంటు నమూనాను ప్రభుత్వం ఆన్లైన్లో పొందుపరచనుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునే వ్యక్తి వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తులో ఆధార్ ఎంటర్ చేయగానే డేటా సెంటర్ నుంచి సదరు వ్యక్తి వివరాలు, వేలిముద్రలతోసహా అందులోకి వస్తాయి. ఆస్తి వివరాలకు సంబంధిం చిన ఖాళీల్లో విస్తీర్ణం హద్దులను పూరించాల్సి ఉంటుంది. మార్కెట్ విలువ కూడా ఆన్లైన్లో తెలుసుకుని బ్యాంకు ఖాతా నుంచే నగదు బదిలీ ద్వారా చలానా అవసరం లేకుండా ఫీజు చెల్లించవచ్చు. ఏ తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటారో అందులో తెలిపితే ఖాళీలను బట్టి స్లాట్ కేటాయిస్తారు. ఆరోజున వెళితే మరోమారు వేలిముద్రలు, ఫొటోలు తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ల శాఖలో దళారీల ప్రమేయాన్ని తొలగించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని చూస్తోంది. అయితే ఈ విధానం వల్ల ఎన్నో దశాబ్ధాలుగా ఉపాధి పొందుతున్న తాము రోడ్లపాలు కావాల్సి వస్తుందని దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లెసైన్స్ విధానం ద్వారా దస్తావేజులు రాసే పద్దతిని పునరుద్దరించాలని లేఖర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వేణుగోపాల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తుల క్రయ విక్రయాల దస్తావేజులను పూర్వం గ్రామ కరణాలు, మునసబ్లు రాస్తేండేవారని, దీనివల్ల గ్రామ పాలన కుంటుపడేదన్నారు. దీంతో దస్తావేజు లేఖర్ల వృత్తిని చట్టబద్దత చేస్తూ లెసైన్స్ విధానాన్ని గతంలో ప్రవేశ పెట్టారని వివరించారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి కోసం ఈ వృత్తిని ఎంచుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఆన్లైన్ విధానాన్ని తీసుకొస్తే అందువల్ల అనేక తప్పిదాలు చోటుచేసుకుని శాఖాపరం గా ఇబ్బందులు వస్తాయన్నారు. శనివా రం కూడా తమ సమ్మె కొనసాగుతుందన్నారు. దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు సంజీవరాయుడు, నాయకులు ఎం.మల్లేష్, సి.నాగరాజు, ఇక్బా ల్, వెండర్లు లోకనాథం, హరికృష్ణ, జయమ్మ, అరుంధతి పాల్గొన్నారు. -
ఎలైట్ డిజైనర్ వీక్
-
6 నుంచి ఆర్టీఈ ప్రవేశ ప్రక్రియ ప్రారంభం
సాక్షి,బెంగళూరు: రాబోయే విద్యా ఏడాది (2014-15)కి ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్-ఆర్టీఈ) కింద ప్రవేశ ప్రక్రియ వచ్చేనెల 6 నుంచి ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది ఈ చట్టం కింద ఎల్కేజీ, ఒకటో తరగతికి అర్హులైన పిల్లలకు ప్రవేశం కల్పించనున్నారు. అల్పాదాయ, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆర్టీఈ చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు ఆయా తరగతిలోని మొత్తం సీట్లలో 25 శాతాన్ని ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కచ్చితంగా కేటాయించాల్సిందే. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఆర్టీఈ క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అధికారికంగా అందుబాటులో ఉంచింది. ఇందులోని వివరాల ప్రకారం.... జనవరి 6న ప్రతి బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి కార్యాలయంలో స్థానిక విద్యా సంస్థల్లో ఆర్టీఈ కింద అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు నోటీసు బోర్డులో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులు సంబంధిత పాఠశాలలో కాని లేదా బీఈఓ కార్యాలయాల్లో ఉచితంగా పొందవచ్చు. జన వరి 7 నుంచి ఫిబ్రవరి 8 తేదీల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చదలిచిన పాఠశాలలో దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఆ వివరాలను స్థానిక బీఈవో అధికారుల విద్యాసంస్థల యాజమాన్యం ఫిబ్రవరి 17లోపు అందజే యాల్సి ఉంటుంది. సదరు బీఈవో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి తుది జాబితాను కార్యాలయంతో పాటు విద్యా సంస్థల నోటీసు బోర్డులో అదేనెల 28న పెట్టాల్సి ఉంటుంది. అటుపై విద్యా ఏడాది ప్రారంభం రోజు నుంచి ఆర్టీఈ కింద అడ్మిషన్ పొందిన విద్యార్థులు తము ఎంచుకున్న పాఠశాలకు వెళ్లవచ్చు. నిధుల వ్యయం ప్రభుత్వానిదే! ఆర్టీఈ కింద అన్ఎయిడెడ్ పాఠశాలల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థుల చదువుకు అయ్యే మొత్తాన్ని (ఒక్కొక్కరికి ఏడాదికి రూ.11,500) ప్రభుత్వమే భరిస్తుంది. ఇందులో 65 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 35 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రతి విద్యా సంస్థ మొత్తం సీట్లలో 25 శాతం సీట్లు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. వీటిలో 7.5 శాతం ఎస్సీ, 1.5 శాతం ఎస్టీ, 3 శాతం వికలాంగులకు, 2 శాతం హెచ్ఐవీ పీడిత విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లలో ఓబీసీ వర్గానికి చెందిన విద్యార్థులు అడ్మిషన్ పొందవచ్చు. మరింత సమాచారం కోసం www.schooleducation.kar.nic. in లో సంప్రదించవచ్చు.