వాట్సాప్ ఇక ప్రపంచవ్యాప్తంగా ఉచితం | Worldwide whats app longer be free | Sakshi
Sakshi News home page

వాట్సాప్ ఇక ప్రపంచవ్యాప్తంగా ఉచితం

Published Tue, Jan 19 2016 5:00 AM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM

వాట్సాప్ ఇక ప్రపంచవ్యాప్తంగా ఉచితం - Sakshi

వాట్సాప్ ఇక ప్రపంచవ్యాప్తంగా ఉచితం

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ఇక ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా వాడుకోవచ్చు. ఏడాదికి వసూలు చేస్తున్న ఒక డాలరు ఫీజును రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ సోమవారం తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఆదాయం కోసం థర్డ్ పార్టీల నుంచి ప్రకటనలను కూడా ప్రవేశపెట్టబోమని పేర్కొంది.

 

వాట్సాప్‌ను వాడుకున్న తొలి ఏడాది తర్వాత ఫీజు చెల్లించాలని కొంతమంది యూజర్లను అడుగుతున్నామని, అయితే తాము విస్తరించడంతో, అది అమల్లో సాధ్యం కావడం లేదని తేలినట్లు వెల్లడించింది. తమ యాప్‌కు సంబంధించిన వివిధ వెర్షన్లపై ఫీజును రానున్న వారాల్లో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

 

ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్ భారత్‌లోని యూజర్ల నుంచి ఫీజు వసూలు చేయడం లేదు. కాగా, ప్రకటనల్లేకుండా తమ సర్వీసు అందించేందుకు కొన్ని టూల్స్‌ను పరీక్షిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తమ యాప్ ద్వారా యూజర్లు వ్యాపారులతో, బ్యాంకులు తదితర సంస్థలతో సంప్రదింపులు నెరపడానికి టూల్స్‌ను ఈ ఏడాది నుంచి పరీక్షిస్తామని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement