రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
కేంద్రాల వద్ద 144 సెక్షన్ వెబ్‌సైట్‌లోనూ హాల్‌టికెట్లు
విద్యారణ్యపురి : జిల్లాలో ఈ నెల 9 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 1,04,381 మంది హాజరుకానున్నారు. 9న ప్రారంభం కానున్న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 48,874 మంది, 10న మొదలయ్యే సెకండియర్ పరీక్షలకు 55,507 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లావ్యాప్తంగా 131 పరీక్ష కేంద్రాలు కేటారుుంచారు. ఇందులో 62 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కాగా... 69 ప్రభుత్వ, ఇతర రెసిడెన్షియల్ , ఎయిడెడ్ కాలేజీలు ఉన్నారుు.
సుమారు 5 వేల మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. 131 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు(సీఎస్), డిపార్టుమెంటల్ ఆఫీసర్లను( డీఓ) నియమించారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లతోపాటు పది సిట్టింగ్ స్క్వాడ్లను నియమాకం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్‌ఐ, సీనియర్ లెక్చరర్లు సభ్యులుగా ఉన్నారు. సిట్టింగ్ స్క్వాడ్ ఒక్కో బృందంలో సీనియర్ లెక్చరర్‌తోపాటు పీడీ లేదా లైబ్రేరియన్ ఉన్నారు. అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్‌లను కూడా నియూమకం చేశారు. ఉన్నతస్థారుులో పర్యవేక్షణకు హైపవర్ కమిటీ నియూమకమైంది. ఇందులో జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఇంటర్‌విద్య ఆర్జేడీ, డీవీఈఓ ఉన్నారు.
పరీక్షల షెడ్యూల్..
ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు 27వ తేదీ వరకు కొనసాగనున్నారుు. ఆయా పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరగనున్నారుు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు ఉదయం 8.30 గంటల కల్లా చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా కళాశాలలు ప్రిన్సిపాళ్లు తీసుకెళ్లారని, ఈ మేరకు వాటిని తీసుకుని పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లను తీసుకోవచ్చని వెల్లడించారు. పరీక్షల నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా, పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధించకుండా సంబంధిత అధికారులతో ఇంటర్ విద్య ఆర్‌ఐఓ మాట్లాడారు. ఇటీవల కలెక్టరేట్‌లో వివిధ శాఖాధికారులతో కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సంబంధిత అధికారులకు కూడా ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షల సమయంలో మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
సమస్యాత్మక కేంద్రాలు 23
జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి సమస్యాత్మక కేంద్రాలు 23 ఉన్నట్లు గుర్తించిన అధికారులు... వీటిపై ప్రత్యేక దృష్టిసారించారు. కాపీయింగ్ నిరోధానికి చర్యలు తీసుకున్నారు. ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీ(కురవి), ఏపీఎస్‌డబ్ల్యూజేసీ (మహబూబాబాద్), జీజేసీ(బి)(మహబూబాబాద్), ప్రిస్టన్ జూనియర్ కాలేజీ (జనగామ), ప్రభుత్వ జూనియర్ కాలేజీ(పరకాల), తేజస్విని గాంధీ జూనియర్ కాలేజీ (భూపాలపల్లి), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (భూపాలపల్లి, మద్దూరు, చేర్యాల, నెక్కొండ), పోతన కో ఆపరేటివ్ జూనియర్ కాలేజీ (పాలకుర్తి), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (కేసముద్రం, గూడూరు, కొత్తగూడెం,నర్మెట, చిట్యాల, దేవరుప్పుల, కొడకండ్ల, జఫర్‌గఢ్ సెంటర్లు సమస్యాత్మక కేంద్రాల జాబితాలో ఉన్నారుు. కాగా, జిల్లాలో మూడు సెల్ఫ్ సెంటర్లు ఏర్పాటుచేశారు. ఇందులో ధర్మసాగర్, మంగపేట, తాడ్వారుు ప్రభుత్వ నియర్ కాలేజీలు ఉన్నాయి.
సర్వం సిద్ధం
Published Sun, Mar 8 2015 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement
Advertisement