బాబు చేసింది ఏమీ లేదు
అభివృద్ధి పేరుతో లాభపడింది ఆయనే..
‘స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్’ సదస్సులో మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో: ‘హైదరాబాద్ నగరం ఎవరో ఒక్కరు నిర్మించింది కాదు. విశిష్ట భౌగోళిక స్వరూపం కారణంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ఈ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. చంద్రబాబు నాయుడు ఈ సిటీకి మంచి మార్కెట్ తీసుకొచ్చారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదు. కానీ ఆయన ఎంతో లాభపడ్డారు. నగర సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. ఆయన నాయకత్వంలో వచ్చే మూడేళ్లలో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం’.. అని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ‘సెలబ్రేటింగ్ ది స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో ఓ హోటల్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ రంగాల నిపుణులతో స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ ప్రతిజ్ఙ చేయించారు. వివిధ రంగాల నిపుణులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
సుస్థిరాభివృద్ధి దిశగా..
ముఖ్యమంత్రి కేసీఆర్ సుస్థిరాభివృద్ధి దిశగా నగరాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, నగరాన్ని సేఫ్, స్మార్ట్, క్లీన్, గ్రీన్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి అన్ని మతాలు, వర్గాలు సమానమేనని, రంజాన్, క్రిస్మస్ పండుగలను జరిపిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా నీరు అందిస్తామని శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీపడేది లేదన్నారు. అధికారంలోకి రాగానే పేకాట క్లబ్బులను మూసివేయడం ఖాయమని పేర్కొన్నారు.
భవిష్యత్‌ను నిర్ణయించేది రాజకీయాలే..
మన భవిష్యత్‌ను రాజకీయాలే నిర్ణయిస్తాయని, బల్దియా ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మీ అమూల్యమైన ఓటును టీఆర్‌ఎస్ పార్టీకి వేస్తే మీ సమస్యల పరిష్కారాన్ని మేము బాధ్యతగా స్వీకరిస్తామని భరోసానిచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల ఎంపికను శాస్త్రీయంగా చేపట్టలేదని, వివిధ భౌగోళిక స్వరూపాలున్న పలు నగరాలను ఒకే గాటన కట్టడం సరికాదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వార్షిక బడ్జెట్ ఆరు వేల కోట్లుంటే.. స్మార్ట్‌సిటీ పథకం కింద రూ.100 కోట్లు ఇస్తామనడం సబబు కాదని ఆయన అన్నారు.
నైబర్‌హుడ్ కమిటీల ఏర్పాటు
అపార్ట్‌మెంట్లు, కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, మున్సిపల్ విభాగంలో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులతో నైబర్‌హుడ్ కమిటీలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ బాధ్యతలు తాజాగా తాను స్వీకరించిన నేపథ్యంలో నగరంలో అన్ని ప్రాంతాల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నగరంలో ప్రైవేటు రంగానికి దీటుగా ప్రభుత్వ రంగంలో మెరుగైన విద్యాసంస్థల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని వివరించారు.
ఇంకా ఏమన్నారంటే..
మెట్రో స్టేషన్లు నగర సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు చేరుకునేందుకు వీలుగా ఎలక్ట్రికల్ ఫీడర్ బస్సులను ఏర్పాటు చేస్తాం. వీటితో కాలుష్యం, వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా తగ్గుతుంది. చిన్న సినిమాల నిర్మాతలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. మల్టీప్లెక్స్ థియేటర్లల్లో చిన్న సినిమాల ప్రదర్శనకు చర్యలు తీసుకుంటాం.పన్నుల భారంతో సతమతమవుతున్న చిన్న ఆస్పత్రుల పరిరక్షణపై ఆస్పత్రి సంఘాలు ముందుకొస్తే వారి డిమాండ్లను పరిష్కరిస్తాం. చిన్నస్థాయి ఆఫ్ సెట్ ప్రింటింగ్ రంగానికి విద్యుత్