Minister ketiar
-
ఏమిటీ నిర్లక్ష్యం?
సిటీబ్యూరో ‘చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేరా..గుంతలు, రోడ్లను కూడా నేనే పరిశీలించి ఆదేశాలు ఇవ్వాలా.. ? నేను (మంత్రి), మేయర్, కమిషనర్ వస్తే తప్ప పనులు చేయరా...’ అంటూ రాష్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం శ్రీనగర్‌కాలనీ, యూసుఫ్‌గూడ, గాజులరామారం, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని రహదారుల పనులను పరిశీలించిన ఆయన..తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీనగర్‌కాలనీ, యూసుఫ్‌గూడలలో రోడ్లపై గుంతలు, వివిధ విభాగాలు ఇష్టారాజ్యంగా చేస్తున్న తవ్వకాలపై మంత్రి సీరియస్ అయ్యారు. అధికారులు, విభాగాల మధ్య సమన్యయ లోపంతోనే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని తేల్చిచెప్పారు. తన పర్యటనతో అధికారుల్లో గుబులు పుట్టించారు. పనులు పూర్తి చేసేందుకు నెలరోజులు పడుతుందని కాంట్రాక్టర్, 15 రోజుల్లో అవుతుందని విద్యుత్ శాఖ ఇంజినీర్లు చెప్పడంతో ‘స్టోరీలు చెప్పొద్దు’ అంటూ హెచ్చరించారు. రెండు పనులు కలిసి నెల అనడంతో ‘కామన్సెన్స్ లేదా..’అంటూ అసహనం వ్యక్తం చేశారు. తవ్వకాలతో తాగునీటి లైన్లు పాడవడంతో దాదాపు 45 రోజులుగా నీరు రావడం లేదని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. మరోచోట గత కొన్ని రోజులుగా మురుగునీటి సమస్య ఉందని ఫిర్యాదు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో భోలక్‌పూర్ ఘటన పునరావృతమవుతుందని మంత్రి హెచ్చరించారు. పనులు పూర్తయ్యేంత వరకు ఒక వర్క్ ఇన్స్పెక్టర్ను అక్కడే ఉంచాలని సూచించారు. హెచ్‌టీ లైన్లు, పైపులైన్లు తదితరమైన వాటికోసం రోడ్లు తవ్వి ఎంతకాలమైనా పనులు పూర్తికాపోవడంతో ప్రజలు పడుతున్న బాధలు చూసి అసహనానికి గురయ్యారు. ఎక్కడి కక్కడే చెత్తకుప్పలు, మట్టిదిబ్బలు, ప్రజలు నడవాల్సిన ఫుట్‌పాత్‌లపై పిచ్చిమొక్కలు కనిపించడంతో తట్టుకోలేకపోయారు. వాటిని ఎప్పటికప్పుడు బాగుచేయవద్దా అని అధికారులను నిలదీశారు. పలు చోట్ల రోడ్ల నాణ్యతపై, గుంతలపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసారు. గవర్నర్ వ్యాఖ్యలపై ఆరా తీసిన మంత్రి.. పర్యటనలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ సంజయ్గౌడ్ను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఇటీవల ఆయన గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో ఆ వివరాలు కనుక్కొన్నారు. రోడ్ల పరిస్థితిపై గవర్నర్ చేసిన వ్యాఖ్యల గురించి ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక సర్కిల్ అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు. కింది స్థాయి సిబ్బంది, డిప్యూటీ కమిషనర్‌స్థాయి అధికారుల పనితీరు ఏమాత్రం బాగులేద న్నారు. సాక్షాత్తు గవర్నర్ వచ్చి చెప్పినా సమస్యలు పట్టించుకోరా అంటూ అధికారులపై మండిపడ్డారు. అసలే ఇరుకు దారిలో నిత్యం మురగునీరు పారుతుందని, డంపర్బిన్లు నిండిపోతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు ఈ సందర్భంగా మంత్రికి ఫిర్యాదు చేశారు. వివిధ విభాగాల వారు ఒకరి తర్వాత ఒకరు రోడ్లను తవ్వి వదిలేస్తున్నారని, ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారని, కళ్యాణ్‌నగర్, శ్రీనగర్‌కాలనీల్లో చాలా కాలం క్రితమే రోడ్లను తవ్వి కేబుల్స్ వేసినప్పటికి ఇప్పటికీ పూడ్చలేదని ఫిర్యాదు చేశారు. వివిధ విభాగాల అధికారులు , మెట్రో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మంత్రి పర్యటన ముఖ్యాంశాలు..... ⇒బురదమయంగా మారిన రహదారిపై మంత్రి వస్తున్నాడని తెలియడంతో అధికారులు అప్పటికప్పుడు ఎల్లారెడ్డిగూడ ఎస్బీఐ బ్యాంకు ముందు ఉన్న బురద మట్టిని ఫుట్‌పాత్ మీద వేస్తుండగా మంత్రి గమనించి ఇది పాదచారులకు ఇబ్బంది కాదా అని మందలించారు. ⇒కేబుల్ పనుల తవ్వకాల వల్ల, వర్షం వల్ల ఇక్కడ బురదలో కిందపడి ప్రజలు గాయపడుతున్నా అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానిక డీసీని పిలిచి మందలించారు. రెండు నెలలుగా ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉందని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత సిబ్బంది మరమ్మతులు చేయకపోవడంపై ⇒ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడు ఎండి. ఉమర్ అనే వ్యక్తి కేటీఆర్ వద్దకు వచ్చి మురుగునీటి సమస్యను ప్రస్తావించారు. ⇒యూసుఫ్‌గూడలో ఒకే రోడ్డులో రెండు వైపులా రోడ్ల తవ్వకాలతో మధ్యలో ఉన్న రోడ్డు గురించి అధికారులతో మంత్రి మాట్లాడారు. రెండు వైపులా తవ్వకాలకు అధికారులు అనుమతులిస్తే మధ్యలో వాహనదారులు చిన్న రోడ్డుపై సర్కస్ ఫీట్లు చేయాలా అంటూ ప్రశ్నించారు. ⇒యూసుఫ్‌గూడ చెక్‌పోస్టులో బస్టాప్‌లో మంత్రి ఆగి ఉన్న ప్రయాణికులతో సంభాషించారు. ఈ సందర్భంగా వారు ఇక్కడ బస్షెల్టర్లేదని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు దృష్టికి తేగా తాత్కాలికంగానైనా వెంటనే షెల్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ⇒ మెట్రోపనుల కోసం యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో కొంత భాగం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి చేరుకున్న కేటీఆర్ అక్కడ పరిస్థితిపై విద్యార్థులతో మాట్లాడారు. ఇంకా పాఠశాలలో గ్రౌండ్ ఉందా, వసతులు ఎలా ఉన్నాయంటూ ప్రశ్నించారు. ⇒132 కేవీ విద్యుత్లైన్పనులు ఇంకా ఎన్ని రోజులు చేస్తారు. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి రోడ్లపై జనాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రాజెక్టు విభాగం అధికారికి కేటీఆర్ సూచించారు. గాలి వస్తే కరెంట్ ఎందుకు పోతుందని అడిగారు. ⇒ శ్రీనగర్ కాలనీలో మంత్రి వస్తున్నారని తెలిసి కూడా కాంట్రాక్టర్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాన్‌హోల్ రోడ్డుకు ఎత్తుగా ఉండటంతో ఇలా ఉంటే ఎలా.. అంటూ మండిపడ్డారు. ⇒మొత్తం ఎన్ని రోడ్డు కటింగ్‌లకు అనుమతులిచ్చారు.. ఎన్ని పూర్తయ్యాయి.. మిగతావి ఎప్పుడవుతాయి..పూర్తి సమాచారం అందించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. రూ.5 భోజనం బాగాలేదు...(బాక్సులో) ‘ఇది సాంబారా.. నీళ్లా.. ? కారం ఎక్కువ వేశారు..రచీ పచీ లేదు..ఎలా తినాలి దీన్ని... ’అంటూ స్వయంగా ‘రూ. 5 భోజనం’ తిన్న అనంతరం మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని రూ.5 భోజన కేంద్రంలో నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఇక ఇక్కడే రూ. 6 కోట్లతో జరుగుతున్న 6 ఎంఎల్ రిజర్వాయర్ నిర్మాణ విషయంలో కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పనుల విషయంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేయగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట పర్యటనలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమండలి, విద్యుత్, తదితర శాఖల ఉన్నతాధికారులున్నారు. -
బాబు చేసింది ఏమీ లేదు
అభివృద్ధి పేరుతో లాభపడింది ఆయనే.. ‘స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్’ సదస్సులో మంత్రి కేటీఆర్ సిటీబ్యూరో: ‘హైదరాబాద్ నగరం ఎవరో ఒక్కరు నిర్మించింది కాదు. విశిష్ట భౌగోళిక స్వరూపం కారణంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. ఈ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. చంద్రబాబు నాయుడు ఈ సిటీకి మంచి మార్కెట్ తీసుకొచ్చారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదు. కానీ ఆయన ఎంతో లాభపడ్డారు. నగర సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉంది. ఆయన నాయకత్వంలో వచ్చే మూడేళ్లలో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం’.. అని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ‘సెలబ్రేటింగ్ ది స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో ఓ హోటల్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ రంగాల నిపుణులతో స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ ప్రతిజ్ఙ చేయించారు. వివిధ రంగాల నిపుణులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సుస్థిరాభివృద్ధి దిశగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సుస్థిరాభివృద్ధి దిశగా నగరాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, నగరాన్ని సేఫ్, స్మార్ట్, క్లీన్, గ్రీన్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి అన్ని మతాలు, వర్గాలు సమానమేనని, రంజాన్, క్రిస్మస్ పండుగలను జరిపిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా నీరు అందిస్తామని శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీపడేది లేదన్నారు. అధికారంలోకి రాగానే పేకాట క్లబ్బులను మూసివేయడం ఖాయమని పేర్కొన్నారు. భవిష్యత్‌ను నిర్ణయించేది రాజకీయాలే.. మన భవిష్యత్‌ను రాజకీయాలే నిర్ణయిస్తాయని, బల్దియా ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మీ అమూల్యమైన ఓటును టీఆర్ఎస్ పార్టీకి వేస్తే మీ సమస్యల పరిష్కారాన్ని మేము బాధ్యతగా స్వీకరిస్తామని భరోసానిచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల ఎంపికను శాస్త్రీయంగా చేపట్టలేదని, వివిధ భౌగోళిక స్వరూపాలున్న పలు నగరాలను ఒకే గాటన కట్టడం సరికాదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వార్షిక బడ్జెట్ ఆరు వేల కోట్లుంటే.. స్మార్ట్‌సిటీ పథకం కింద రూ.100 కోట్లు ఇస్తామనడం సబబు కాదని ఆయన అన్నారు. నైబర్‌హుడ్ కమిటీల ఏర్పాటు అపార్ట్మెంట్లు, కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, మున్సిపల్ విభాగంలో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులతో నైబర్‌హుడ్ కమిటీలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ బాధ్యతలు తాజాగా తాను స్వీకరించిన నేపథ్యంలో నగరంలో అన్ని ప్రాంతాల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నగరంలో ప్రైవేటు రంగానికి దీటుగా ప్రభుత్వ రంగంలో మెరుగైన విద్యాసంస్థల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని వివరించారు. ఇంకా ఏమన్నారంటే.. మెట్రో స్టేషన్లు నగర సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు చేరుకునేందుకు వీలుగా ఎలక్ట్రికల్ ఫీడర్ బస్సులను ఏర్పాటు చేస్తాం. వీటితో కాలుష్యం, వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా తగ్గుతుంది. చిన్న సినిమాల నిర్మాతలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. మల్టీప్లెక్స్ థియేటర్లల్లో చిన్న సినిమాల ప్రదర్శనకు చర్యలు తీసుకుంటాం.పన్నుల భారంతో సతమతమవుతున్న చిన్న ఆస్పత్రుల పరిరక్షణపై ఆస్పత్రి సంఘాలు ముందుకొస్తే వారి డిమాండ్లను పరిష్కరిస్తాం. చిన్నస్థాయి ఆఫ్ సెట్ ప్రింటింగ్ రంగానికి విద్యుత్ -
ఫలించిన కేటీఆర్ వ్యూహం..
120 డివిజన్లలో రెబల్స్‌తో నేరుగా మాట్లాడిన కేటీఆర్ 600 మంది నామినేషన్ల ఉపసంహరణ సిటీబ్యూరో: బల్దియా ఎన్నికల్లో రెబల్స్ ను దారికి తెచ్చుకునేందుకు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అమలు చేసిన వ్యూహం ఫలించింది. గత మూడు రోజులుగా 120 డివిజన్లలో టీఆర్ఎస్ రెబల్స్‌గా నామినేషన్లు వేసిన అభ్యర్థులను మంత్రి తన వద్దకు పిలిపించుకొని బుజ్జగించారు. దీంతో సు మారు 600 మంది అసంతృప్తులు నామినేషన్లను ఉపసంహరిం చుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థులకు...అసంతృప్తులకు నచ్చజెప్పి... కలిసి పని చేయాలని సూచించారు. ఇదే కసరత్తు నామినేషన్ల గడువు పూర్తయిన వెంటనే డివిజన్ల వారీ గా సమన్వయకర్తలను నియమించి... పార్టీ తరఫున నామినేషన్లు వేసిన వారిని మంత్రి కేటీఆర్ గుర్తించారు. గత మూడు రోజులుగా ఇదే కసరత్తు చేశారు. అసంతృప్త నేతలతో మాట్లాడాల్సిందిగా వారికి సూచిం చారు. వారితోపాటు పార్టీ ఇన్‌చార్జులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో బుజ్జగింపుల పర్వం కొనసాగించారు. టిక్కెట్ రాక తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనైన నేతలను ప్రత్యేకంగా బేగంపేట్‌లోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు. గ్రేటర్ వ్యాప్తంగా 90 శాతం మంది రెబల్స్ మంత్రి సూచనల మేరకు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. మూడు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల మార్పు సిటీబ్యూరో: నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మూడు డివిజన్లలో ఇప్పటికే అభ్యర్థులుగా ప్రకటించిన వారిని పక్కనపెట్టి వేరొకరికి బి-ఫారాలు అందజేయడం చర్చనీయాంశమైంది. వివేకానందనగర్ డివిజన్ నుంచి తొలుత స్వాతిని పార్టీ అభ్యర్థిగా ప్రకటిం చినప్పటికీ... గురువారం మాధవరం లక్ష్మికి టిక్కెట్ ఇచ్చా రు. స్వాతికి స్థానికంగా ఓటు లేక ఆమె నామినేషన్ తిరస్కరణకు గురవడంతో అభ్యర్థి మార్పు తప్పలేదు. రాజకీయ కారణాల రీత్యా ఆల్విన్ కాలనీలో కొమురగోని వెంకటేశ్ గౌడ్ స్థానంలో దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌కు బి-ఫారం ఇచ్చారు. జగద్గిరిగుట్టలో శేఖర్ యాదవ్ స్థానంలో జగన్‌కు పార్టీ టిక్కెట్ ఇవ్వడం విశేషం. గతంలో ప్రకటించకుండా మిగి లిన కవాడిగూడ డివిజన్‌కు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయ న్న కుమార్తె లాస్య నందితకు చివరి నిమిషంలో బీఫారం ఇచ్చారు. కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి పారిజాతకు బి-ఫారం అందజేశారు. దీంతో మొత్తంగా గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో ఉన్నట్లేనని పార్టీ వర్గాలు తెలిపాయి. -
దళితులకు భూ పంపిణీ
సాక్షి, మహబూబ్‌నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దళితులకు మూడెకరాల భూపంపిణీ చేసింది. ఈ కార్యక్రమాన్ని పంద్రాగస్టు సందర్భంగా జిల్లాకేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన వేడుకలకు అతిథిగా విచ్చేసిన పంచాయతీరాజ్, సమాచార, సాంకేతికరంగ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించింది. జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన అర్హులైన 20 మంది దళితులకు ఆయన చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. అచ్చంపేట మండలం పులిజాలకు చెందిన ఎం.లక్ష్మమ్మ, ఆర్.నారమ్మ, అలంపూర్ మండలం కోయిల్దిన్నెకి చెందిన హెచ్.లక్ష్మీదేవి, హెచ్.మేరియమ్మ, హెచ్.భాగ్యమ్మ, హెచ్.ప్రమీలమ్మలు పట్టాలు అందుకున్నారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గం కరివెన గ్రామానికి చెందిన కప్పెట నాగమ్మ, బొడ్రాతి మూర్తమ్మ, గొరిట మాసమ్మ, షాద్‌నగర్ నియోజకవర్గం వెంకిర్యాలకి చెందిన కె.లక్ష్మమ్మ, టి.నర్సమ్మ, వి.సుక్కమ్మ, జడ్చర్ల నియోజకవర్గం కొత్తూరు గ్రామానికి చెందిన బి.రేవతమ్మ, ఎం.లక్ష్మమ్మ, వై.మంజులకు పట్టాలు పంపిణీ చేయగా, మిగిలిన వారు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలను తీసుకున్నారు. జీవితాంతం రుణపడి ఉంటాం మిడ్జిల్ : ‘నిరుపేదలను గుర్తించి భూమి ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వానికి, కేసీఆర్ సార్‌కు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మాలాంటోళ్లకు పిలిచి భూమి ఇచ్చిన సర్కార్ ఇదొక్కటే. సంతోషంగా ఉంది. క లలో కూడా పట్టాదారులమవుతామని అనుకోలేదు. తీసుకున్న భూమిలో పంటలు సాగుచేసి వాటితో పిల్లల్ని బాగా చదివించుకుంటాం’ అని భూములు పొందిన లబ్ధిదారులు చెప్పిన మాటలివి. శుక్రవారం జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిడ్జిల్ మండలం కొత్తూర్‌కు చెందిన ముగ్గురు నిరుపేద రైతులకు మంత్రి కేటీఆర్ పట్టాలు అందజేశారు. వీరిలో లక్ష్మమ్మకు సర్వే నం.384/ఈలో, పార్వతమ్మకు 384/అ లో, మంజులకు 384/ఆ లో మూడెకరాల చొప్పున పంపిణీ చేశారు.