ఈ నెల 30న కేసీఆర్ బహిరంగ సభ: కేటీఆర్ | KCR Rally in hyderabad city in january 30, says KTR | Sakshi
Sakshi News home page

ఈ నెల 30న కేసీఆర్ బహిరంగ సభ: కేటీఆర్

Published Sat, Jan 23 2016 11:57 AM | Last Updated on Wed, Aug 15 2018 8:58 PM

ఈ నెల 30న కేసీఆర్ బహిరంగ సభ: కేటీఆర్ - Sakshi

ఈ నెల 30న కేసీఆర్ బహిరంగ సభ: కేటీఆర్

హైదరాబాద్ :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జనవరి 30వ తేదీన హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ జరగనుందని రాష్ట్ర ఐటీ, పంచయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం హైదరాబాద్ లో కేటీఆర్ మాట్లాడుతూ... మేయర్పై తాను చేసిన సవాల్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ స్వీకరించడం లేదని ఆరోపించారు.

100 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు, జానారెడ్డి పార్టీలు మారలేదా ? మిగతావారు పార్టీలు మారితే తప్పేంటని కేటీఆర్ ఈ సందర్బంగా ప్రతిపక్షాలను ప్రశ్నించారు. హెచ్సీయూ విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని కేటీఆర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement