
'కిషన్ రెడ్డికి కూడా తెలియదు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ భోళాశంకరుడని... ప్రజలకు కావాల్సినవన్నీ చేస్తారని ఆయన తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో ఎలాంటి పథకాలు అమలవుతున్నాయో ప్రజలందరికీ తెలుసునని, కేంద్రంలో అమలయ్యే పథకాలు ఎవరికీ తెలియదని చెప్పారు. మోదీ ఏం పథకాలు ప్రవేశపెట్టారో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తమలో ఎవర్ని అడిగినా చెబుతామని అన్నారు.
తెలంగాణ భవన్ లో వికలాంగుల జేఏసీతో శనివారం ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నిజామాబాద్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ ఇళ్లలో వికలాంగులకు 3 శాతం ఇవ్వాలనుకుంటున్నట్టు కవిత చెప్పారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం కృషి చేయాలని వికలాంగుల జేఏసీని కోరారు.