
టీడీపీని భ్రష్టుపట్టిస్తున్నారు...
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీనే నమ్ముకొని అంకిత భావంతో మూడు దశాబ్దాలకుపైగా పార్టీకి సేవ చేస్తున్నవారు...
⇒రేవంత్, మాగంటి తీరుపై ‘నైషధం’ ఆగ్రహం
⇒ఎన్టీఆర్ ఫొటోతో ధర్నా
సిటీబ్యూరో: ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీనే నమ్ముకొని అంకిత భావంతో మూడు దశాబ్దాలకుపైగా పార్టీకి సేవ చేస్తున్నవారు... ప్రస్తుతం పార్టీలో అగ్రనేతలుగా చెలామణి అవుతున్న కొందరి తీరుతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని, వారికి తగిన న్యాయం చే యాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జిల్లా టీడీపీ నాయకుడు నైషధం సత్యనారాయణమూర్తి ఎన్టీఆర్ ఘాట్‌లో ధర్నా నిర్వహించారు. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా సోమవారం ఉదయం ఎన్టీఆర్‌తో కలిసి గతంలో తాను దిగిన ఫొటోతో ఆయన నిరసన తెలిపారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, హైదరాబా ద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ నియంతల్లా వ్యవహరిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని తీవ్ర విమర్శ లు చేశారు. ఇద్దరు ముగ్గురు తొత్తులతో హైదరాబాద్‌లో పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. 2002 ఎంసీహెచ్ ఎన్నికల్లో బర్కత్‌పురా డివిజన్ నుంచి బీజేపీ తరపున కార్పొరేటర్ టికెట్ కూడా పొందలేకపోయిన రేవంత్‌రెడ్డి, ప్ర స్తుతం పార్టీలోని ఇద్దరు ముగ్గురితో కలిసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీ అంటే సర్వం తానే అనే అహంతో పార్టీ విధేయులను కాదని ఇష్టమొచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.
సెక్యులర్ పార్టీ అయిన టీడీపీలో మైనార్టీలను అవమానిస్తూ వారిని తీవ్ర మానసికక్షోభకు గురి చేస్తున్నారన్నారు. బీజేపీతో కుమ్మక్కై,అధికార టీఆర్‌ఎస్‌కు లాభం కలిగిం చేలా పార్టీ గెలిచే స్థానాల్లో పోటీ చేయకుండా తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన నారా లోకేశ్ నైషధం నిరసనకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. రామ్‌నగర్ లేదా ఆడిక్‌మెట్ వార్డుల నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న ‘నైషధం’కు టికెట్ల కేటాయింపులో పార్టీ మొండి చేయి చూపింది.