టీడీపీ హయాంలోనే అభివృద్ధి | TDP reign in the development | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలోనే అభివృద్ధి

Published Tue, Jan 26 2016 3:03 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

టీడీపీ హయాంలోనే అభివృద్ధి - Sakshi

టీడీపీ హయాంలోనే అభివృద్ధి

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
 

బన్సీలాల్‌పేట్: హైదరాబాద్ నగరం తెలుగుదేశం హయాం లోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని... జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థులకు పట్టం కట్టాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం బన్సీలాల్‌పేట్ టీడీపీ అభ్యర్థి ఎం.శ్రావణి, టీడీపీ ఇన్‌చార్జి కూన వెంకటేష్ గౌడ్‌లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చాచానెహ్రూ నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

హైటెక్ సిటీ, 18 ఫ్లైఓవర్లు, నెక్లెస్ రోడ్డు అభివృద్ధి...హుసేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే సెటప్‌బాక్స్‌లు, మం చినీటి నల్లా కనెక్షన్లతో పాటు నగరంలోని పేదలకు ఏటా2 లక్షల డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామన్నా రు. టీడీపీ సనత్‌నగర్ ఇన్‌చార్జి కూన వెంకటేష్ గౌడ్, అభ్యర్థి శ్రావణి, బీజేపీ నాయకులతో కలిసి బన్సీలాల్‌పేట్‌లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవికుమార్, కుమా ర్ యాదవ్, కందికంటి విజయ్, హేమలత, సదానంద్, జహంగీర్, దశరథ్, బీజేపీ నాయకులు ఆనంద్ యాదవ్, హరినాథ్, వై.సురేష్‌కుమార్, ఎ. శ్రీనివాస్, ఎస్.వై.గిరి, పాండు, శ్రీనివాస్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement