రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ పగటి కలలు కంటోందంటూ శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ బీజేపీ పగటి కలలు కంటోందంటూ శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భద్రాద్రిలో సమావేశం పెట్టుకున్న బీజేపీ నాయకులకు పోలవరంలో మునిగిపోతున్న గుడి, ఆదివాసీలు, అటవీప్రాంతం కనిపించలేదా అని ప్రశ్నించారు.
ప్రస్తుత డిజైన్‌తో పోలవరం పూర్తిచేస్తే భద్రాద్రి మునిగిపోయే ప్రమాదముందని, దీనిపై ఎందుకు స్పందించడంలేదో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షపార్టీగా కాంగ్రెస్‌పార్టీ విఫలమైందంటూ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. టీడీపీ ఆముదం చెట్టులా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో సీఎం కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకోలేదా అని ప్రశ్నించారు.