
74,23,980 ఇదీ గ్రేటర్‌లో ఓటర్ల సంఖ్య
కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారు.. తొలగించిన వారు..
సిటీబ్యూరో: కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారు.. తొలగించిన వారు.. మార్పులు, చేర్పులు అన్నీ పూర్తయ్యాక వచ్చేనెల 2న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం 74,23, 980 ఓటర్లు తీర్పునివ్వబోతున్నట్టు అధికారులు లెక్కతేల్చారు. ఈ నెల 8వ తేదీ నాటికి వీరి పేర్లు జాబితాలో ఉన్నాయి. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి వారం ముందుగా దరఖాస్తు చేసుకున్న వారందరితో ఈ జాబితాను రూపొందించారు. ఇక కొత్తగా ఓటరుగా నమోదైన వారికి పోలింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. వివరాలను జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి శనివారం విలేకరులకు వెల్లడించారు.
ఈ జాబితా మేరకు..
89,159 మంది ఓటర్లతో సుభాష్ నగర్ టాప్. గత నవంబర్‌లో ఇక్కడ 80,098 మంది ఓటర్లు ఉం డగా.,.. రెండు నెలల్లో మరో 9 వేలకు పైగా పెరి గారు. ఇది జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు.అత్యల్పంగా మెహదీపట్నం డివిజన్‌లో 29,854 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ డివిజన్‌ను అడ్డగోలుగా డీలిమిటేషన్ చేశారని గత పాలక మండలిలో బీజేపీ పక్ష నాయకునిగా ఉన్న బంగారి ప్రకాశ్.. ఏకంగా పార్టీకి రాజీనామా చేయడమే కాక టీఆర్‌ఎస్‌లో చేరారు. పొరుగునే ఉన్న గుడి మల్కాపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. గత పాలక మండలిలో మేయర్‌గా వ్యవహరించిన మహ్మ ద్ మాజిద్‌హుస్సేన్ ఈ డివి జన్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఆయన పోటీ చేసిన అహ్మద్‌నగర్ డివిజన్ బీసీ మహిళకు రిజర్వయింది.
కొత్త జాబితా మేరకు ఓటర్లు ఇలా..
పురుషులు : 39,69,007
మహిళలు : 34,53,910
ఇతరులు : 1,063
మొత్తం : 74,23,980
60 వేలకు మించి ఓటర్లు ఉన్న డివిజన్లలో సరూర్ నగర్ (62,180), రామకృష్ణాపురం (64,604), మైలార్‌దేవ్‌పల్లి (76,038), కొండాపూర్ (72,911), శేరి లింగంపల్లి (62,455), హఫీజ్‌పేట (71,261), బా లాజీ నగర్ (63,548), సూరారం(67,151), కుత్బుల్లాపూర్ (65,653), జీడిమెట్ల (60,327)ఉన్నాయి. 40 వేలలోపు: చావుని (38,335), మెఘల్‌పురా (35,677), బార్కాస్ (35,929), నవాబ్‌సాహెబ్‌కుంట (37,767), పురానాపూల్(34,414), దూద్‌బౌలి (38,153), రామ్నాస్‌పురా (36,926), సులేమాన్ నగర్ (38,310), శాస్త్రిపురం (34,777), రాజేంద్రనగర్(39,091), దత్తాత్రేయ నగర్ (31,364), టోలిచౌకి (35,117), భారతీనగర్(35,057), రామచంద్రాపురం(34,847), వెంకటాపురం(39,041), మెట్టుగూడ (35, 919), రామ్‌గోపాల్‌పేట (35,758) ఉన్నాయి.
థర్డ్ జెండర్లు (ఇతరులు)
థర్డ్ జెండర్ ఓటర్లు మొత్తం 1,063 మంది. వీరు అత్యధికంగా సూరారం డివిజన్‌లో 25 మంది, నాగోల్‌లో 22 మంది ఉన్నారు.