సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలోని 150 వార్డులకు మంగళవారం పోలింగ్ జరుగనుంది. అత్యధికంగా జంగమ్మెట్ వార్డులో 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా నలుగురు మాత్రమే పోటీ చేస్తున్న వార్డుల్లో చావ్‌ని, నవాబ్ సాహెబ్‌కుంట, సులేమాన్‌నగర్, దత్తాత్రేయ నగర్, గోల్కొండ, నానల్‌నగర్, అహ్మద్‌నగర్, చందానగర్‌లు ఉన్నాయి.
సూరారంలో 21 మంది, ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో 18 మంది, రామంతాపూర్‌లో 17 మంది, బాలానగర్‌లో 17 మంది బరిలో ఉన్నారు.15 మంది పోటీ చేస్తున్న వార్డులు: లింగోజిగూడ, సుభాష్‌నగర్, మల్కాజిగిరి.13 మంది పోటీ చేస్తున్న వార్డులు: వెంగళ్రావునగర్, మూసాపేట, నేరేడ్‌మెట్, రామ్‌నగర్ 11 వార్డుల్లో 12 మంది అభ్యర్థులు, 15 వార్డుల్లో 11 మంది వంతున, 18 వార్డుల్లో పదిమంది చొప్పున రంగంలో ఉన్నారు.
మొత్తం పోలింగ్ కేంద్రాలు: 7,802
పోలింగ్ పార్టీలు: 9,352 (ఒక్కో పోలింగ్ పార్టీలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ ఆపీసర్లు ఉన్నారు. ఓటర్లు 1200 కన్నామించిన పోలింగ్ కేంద్రాల్లో మరో అధికారిని అదనంగా నియమించారు.) అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా 1500 మంది మైక్రోఅబ్జర్వర్లు.
3000 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు. వాటి ద్వారా పరిస్థితిని ఆన్‌లైన్‌లో వీక్షించేలా పోలీస్ కంట్రోల్ రూమ్, ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు. ఎన్నికల విధులకు హాజరవుతున్న పొరుగు జిల్లాల ఉపాధ్యాయులకు 3వ తేదీన వేతనంతో కూడిన సెలవు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు.
ఎన్నికలు.. లెక్కలు
పార్టీ పోటీ చేస్తున్న వార్డులు
టీఆర్‌ఎస్ 150
టీడీపీ 95
కాంగ్రెస్ 149
బీజేపీ 66
ఎంఐఎం 60
బీఎస్పీ 55
సీపీఐ 21
సీపీఎం 22
లోక్‌సత్తా 26
రిజస్టర్డు పార్టీలు 49
ఇండిపెండెంట్లు 640
సంక్షిప్తంగా..
జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం : 625 చ.కి.మీ.
మొత్తం ఓటర్లు : 74,23,980
పురుషులు : 39,69, 007
మహిళు : 34,53,910
ఇతరులు : 1163
మొత్తం అభ్యర్థులు: 1333
రిజర్వేషన్లకు అనుగుణంగా సీట్ల కేటాయింపు ఇలా..
ఎస్టీ జనరల్ : 1
ఎస్టీ మహిళ :1
ఎస్సీ జనరల్ :5
ఎస్సీ మహిళ :5
బీసీ జనరల్ :25
బీసీ మహిళ :25
మహిళ జనరల్ : 44
అన్ రిజర్వుడు (ఓపెన్): 44
ఎక్కడ... ఎందరంటే...!
Published Tue, Feb 2 2016 1:35 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement