the Electoral Commission
-
ఎక్కడ... ఎందరంటే...!
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు మంగళవారం పోలింగ్ జరుగనుంది. అత్యధికంగా జంగమ్మెట్ వార్డులో 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా నలుగురు మాత్రమే పోటీ చేస్తున్న వార్డుల్లో చావ్ని, నవాబ్ సాహెబ్‌కుంట, సులేమాన్‌నగర్, దత్తాత్రేయ నగర్, గోల్కొండ, నానల్‌నగర్, అహ్మద్‌నగర్, చందానగర్లు ఉన్నాయి. సూరారంలో 21 మంది, ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో 18 మంది, రామంతాపూర్‌లో 17 మంది, బాలానగర్‌లో 17 మంది బరిలో ఉన్నారు.15 మంది పోటీ చేస్తున్న వార్డులు: లింగోజిగూడ, సుభాష్‌నగర్, మల్కాజిగిరి.13 మంది పోటీ చేస్తున్న వార్డులు: వెంగళ్రావునగర్, మూసాపేట, నేరేడ్మెట్, రామ్‌నగర్ 11 వార్డుల్లో 12 మంది అభ్యర్థులు, 15 వార్డుల్లో 11 మంది వంతున, 18 వార్డుల్లో పదిమంది చొప్పున రంగంలో ఉన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు: 7,802 పోలింగ్ పార్టీలు: 9,352 (ఒక్కో పోలింగ్ పార్టీలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ ఆపీసర్లు ఉన్నారు. ఓటర్లు 1200 కన్నామించిన పోలింగ్ కేంద్రాల్లో మరో అధికారిని అదనంగా నియమించారు.) అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా 1500 మంది మైక్రోఅబ్జర్వర్లు. 3000 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు. వాటి ద్వారా పరిస్థితిని ఆన్లైన్లో వీక్షించేలా పోలీస్ కంట్రోల్ రూమ్, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు. ఎన్నికల విధులకు హాజరవుతున్న పొరుగు జిల్లాల ఉపాధ్యాయులకు 3వ తేదీన వేతనంతో కూడిన సెలవు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు. ఎన్నికలు.. లెక్కలు పార్టీ పోటీ చేస్తున్న వార్డులు టీఆర్ఎస్ 150 టీడీపీ 95 కాంగ్రెస్ 149 బీజేపీ 66 ఎంఐఎం 60 బీఎస్పీ 55 సీపీఐ 21 సీపీఎం 22 లోక్‌సత్తా 26 రిజస్టర్డు పార్టీలు 49 ఇండిపెండెంట్లు 640 సంక్షిప్తంగా.. జీహెచ్ఎంసీ విస్తీర్ణం : 625 చ.కి.మీ. మొత్తం ఓటర్లు : 74,23,980 పురుషులు : 39,69, 007 మహిళు : 34,53,910 ఇతరులు : 1163 మొత్తం అభ్యర్థులు: 1333 రిజర్వేషన్లకు అనుగుణంగా సీట్ల కేటాయింపు ఇలా.. ఎస్టీ జనరల్ : 1 ఎస్టీ మహిళ :1 ఎస్సీ జనరల్ :5 ఎస్సీ మహిళ :5 బీసీ జనరల్ :25 బీసీ మహిళ :25 మహిళ జనరల్ : 44 అన్ రిజర్వుడు (ఓపెన్): 44 -
'లెక్క' లేదు
ఎన్నికల ఖర్చును చూపని అభ్యర్థులు కొందరి సమాచారంలో తేడా అన్ని పార్టీలదీ అదే తీరు సిటీబ్యూరో: ఓ అభ్యర్థి... ఆయన వెనుక బస్తీ నిండా కార్యకర్తలు... వాహనాల బారులు... ఇది అందరికీ కనిపించే వాస్తవం. రెండే వాహనాలు... 20 మందే కార్యకర్తలు...ఇదీ కాగితాల్లోని ‘లెక్క’. వీరికి వెచ్చించే మొత్తంలోనూ ఆ తేడా ‘చూపిస్తున్నారు’. ఇదీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తీరు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తాము చేసే ఖర్చుకు సంబంధించి ఏ రోజుకారోజు లెక్కలను రిటర్నింగ్ అధికారులకు అందజేయాలి. ప్రతి రోజూ కాకపోయినా.. మూడు రోజులకోమారు తమ ఖర్చులను చూపించాలి. ప్రచారంలో భాగంగా చేసే ఖర్చులన్నీ పొందుపరచాలి. అభ్యర్థితో పాటు ప్రచారంలో పాల్గొనే వారు వినియోగించే వాహనాలు.. వారికి అందజేసే టీలు, టిఫిన్ల నుంచి సమస్త సమాచారం పొందుపరచాలి. బహిరంగ సభల వేదికలు.. టెంట్లు, కుర్చీలకు సైతం లెక్కలు చూపాలి. గతంలో ఎన్నికలు ముగిశాక 45 రోజుల్లోగా ఖర్చులన్నీ చూపే అవకాశం ఉండేది.తాజాగా మూడు రోజులకోమారు ‘లెక్క’ చెప్పాల్సిందిగా నిబంధనలు మార్చారు. అయినప్పటికీ అభ్యర్థులెవరూ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మొత్తం 1,333 మంది. వీరిలో దాదాపు 650 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. మిగతా వారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన వారు. అంతో ఇంతో ఇండిపెండెంట్ అభ్యర్థులే లెక్కలు చూపుతున్నారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు మాత్రం రిటర్నింగ్ అధికారుల హెచ్చరికలు ఖాతరు చేయడం లేదు. ప్రచారానికి, లోపాయికారీ బేరాలకే తమకు సమయం సరిపోవడం లేదని... ఇప్పుడు లెక్కలు ఎలా చెప్పేదని కొందరు అభ్యర్థులు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఖర్చు భారీ... లెక్క స్వల్పం ఇప్పటికే అనేక వార్డుల్లో ఇబ్బడిముబ్బడిగా ఓటర్లకు తాయిలాల ఎర వేశారు. వివిధ వస్తువులతో కూడిన గిఫ్ట్‌ప్యాక్‌లు ముట్టజెబుతున్నారు. ఇంకొందరికి ఏం కావాలో తెలుసుకొని వాటిని సరఫరా చేస్తున్నారు. మహిళలు, యువకులు.. ఇలా ఎవరి ఆకాంక్షలకు అనుగుణంగా వారికి చీరలు, గాజులు, ప్లేట్ల నుంచి క్రికెట్ కిట్లు, జిమ్ పరికరాలు... గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చే స్తున్నా రు. ఇంకొందరు నేరుగా ఓటర్లకే ఫోన్ చేసి ‘అన్నా.. మీ ఇంట్లో ఐదు ఓట్లున్నాయి.. మూడు ఫుల్‌బాటిళ్లు పంపిస్తానన్నా... జర చూడు’ అంటున్నారు. ఈ బహుమతులు, నజరానాలు ఒక ఎత్తయితే... ప్రచారం చేసే కార్యకర్తలు.. వారి విందులకు చెల్లిస్తున్నవి మరో ఎత్తు. చాలామంది అభ్యర్థులు అడ్డా మీది కూలీలనే ప్రచారాలకు తీసుకు వెళ్తున్నారు. ఒక్కొక్కరు దాదాపు 200 మందిని వెంట తీసుకువెళ్తున్నారు. వారికి భోజనంతో పాటు ఒక పూట ప్రచారమైతే రూ.150 నుంచి రూ.200 వరకు... రెండు పూట లైతే రూ.300 నుంచి రూ. 500 వరకు చెల్లిస్తున్నారు. ఇవన్నీ లెక్కల్లో చూపడం లేదు. సాధారణ భోజన ఖర్చు మాత్ర మే చూపించే ఎత్తుగడలు వేస్తున్నారు. అంతేకాదు.. 200 మందితో ప్రచారం చేసినా... లెక్కల్లో 40 నుంచి 50 మందినే చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి నోటీసులు పంపుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరోవైపు అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ. 2.08 కోట్లను సర్వెలెన్స్ టీమ్‌లు స్వాధీనం చేసుకున్నాయి. దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. సమాచారం కరువు అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఏరోజుకారోజు వెబ్సైట్లో పొందుపరుస్తామని అధికారులు సెలవిచ్చినప్పటికీ... అమలు కావడం లేదు. సర్కిళ్ల స్థాయిలో లెక్కలను తాము వెల్లడించబోమని.. ప్రధాన కార్యాలయానికే పంపుతామని అక్కడ చెబుతుండగా... జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ అధికారిక సమాచారం లేదు. ఈ సమాచారం తమ వద్ద లేదని చెప్పలేక... సర్కిళ్ల నుంచి పంపించలేదని చెప్పుకోలేక సంబంధిత అధికారులు సతమ తమవుతున్నారు. -
ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో 12 మంది శాసన మండలి సభ్యులు గా ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదలయింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో యిద్దరిని, మిగితా జిల్లాలో ఒక్కరిని శాసనమండలి సభ్యులుగా స్థానిక సంస్థల నుండి ఎన్నుకోనున్నారు. ఈ నెల 9 నామినేషన్లకు చివరి తేదీ. 10 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 30న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. కాగా.. వరంగల్ జిల్లాలో మొత్తం 860 మంది ప్రజా ప్రతినిధులకు ఓటింగ్ అవకాశం వుంది యిందులో zptc 50, mptc 687, కౌన్సిలర్లు 116, ఎక్స్ అఫీషియో సభ్యులు 7 మంది ఉన్నారు. మరో వైపు వరంగల్ కార్పొరేషన్ కు గత రెండేళ్ళు గా ఎన్నిక నిర్వహించకపోవడంతో కార్పోరేటర్లకు ఓటింగ్ అవకాశం లేదు. మంగపేట, హనుమకొండ మండలాలలో కోర్టులో వాజ్యం మూలంగా ఎన్నికలు నిర్వహించలేదు. దరిమిలా యం.పి.టి.సిలకు ఓటింగ్ హక్కు లేదు. మెజారిటీ స్థానాలు అధికార టీఆర్ఎస్ కే వుండడంతో ఆ పార్టీ గెలుపు ఖాయం. అయితే ఎమ్మెల్సీ టికెట్ కి భారీ పోటీ ఉంది. -
80 లక్షలు
ఇదీ గ్రేటర్ ఓటర్ల సంఖ్య జనాభా కంటే అధికం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా కంటే ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇదేదో మేం చెబుతున్న విషయం కాదు... లెక్కలు తేల్చిన వాస్తవం. గత సంవత్సరం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రేటర్ జనాభా 78 లక్షలు. వివిధ కారణాలతో ఇటీవల జీహెచ్ఎంసీలో 6,30,652 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. దీంతో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 80,57,198గా తేలింది. అంటే అప్పటి జనాభా కంటే ఇంకా సుమారు 2.5 లక్షల ఓటర్లు అధికంగా ఉన్నారు. దీన్ని బట్టి ‘లెక్క’ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు వివరాలిలా ఉన్నాయి. నియోజకవర్గాల పరంగా చూస్తే... కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 6,16,437 మంది ఓటర్లు ఉండగా... ఆ తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లిలో 5,53,311 మంది, ఎల్బీనగర్లో 5,36,953 మంది ఉన్నారు. అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 1,98,285 మంది ఉన్నారు.తొలగించిన ఓటర్లు కూకట్పల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 1,08,972 మంది ఉన్నారు. యాకుత్‌పురా నియోజకవర్గంలో అత్యల్పంగా 424 మంది మాత్రమే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇళ్లకు తాళాలు, అనర్హులు లేకపోవడం విశేషం. మలక్‌పేట నియోజకవర్గంలోనూ ఇళ్లకు తాళాలు, అనర్హులైన ఓటర్లు (వయసు తక్కువ ఉన్నవారు) లేరు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. వివిధ రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున ఓటరు జాబితాలో లోటుపాట్లకు తావులేకుండా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రత్యేక చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాల నుంచి ఓటర్ల ముసాయిదాలపై అభ్యంతరాలను స్వీకరించేందుకు బుధవారం గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి బూత్ స్థాయి అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తారు. బూత్ స్థాయిలో ఓటర్ల నమోదు: శివకుమార్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రారంభమైన ఓటర్ల నమోదు కార్యక్రమంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి శివకుమార్ అన్నారు. బుధవారం గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గ కేంద్రాలతో పాటు బూత్‌లెవల్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తు న్న దృష్ట్యా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరై అకారణ ంగా ఓటరు జాబితా నుంచి తొలగించిన వారి వివరాలను అందజేయాలని శివకుమార్ కోరారు. టీడీపీ వినతిపత్రం ఓటర్ల జాబితా నుంచి అకారణంగా చాలా మందిని తొలగించారని ఆరోపిస్తూ హైదరాబాద్ జిల్లా టీడీపీ నాయకులు భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మంగళవారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస్, వనం రమేశ్, మేకల సారంగపాణి తదితరులు భన్వర్‌లాల్‌ను కలిసి జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలోనూ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పునర్విభజనలో అధికార పార్టీ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
కాంగ్రెస్ తొలి జాబితా
12 మంది అభ్యర్థుల ఖరారు ‘దక్షిణం’ నుంచి ‘ఆధార్’ నిలేకని తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ ఛాన్స బళ్లారి నుంచి హనుమంతప్ప, బెల్గాం నుంచి లక్ష్మీ హెబ్బాల్కర్ పోటీ బీజేపీకి పెట్టని కోటగా ‘బెంగళూరు దక్షిణం’ అక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన అనంత్ ఐటీ ఉద్యోగుల ఓట్లే అధికం నిలేకనితో ఆ స్థానాన్ని కైవసం చేసుకునేలా కాంగ్రెస్ ఎత్తు అదే స్థానం నుంచి పోటీ చేయనున్న ఆప్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి కాంగ్రెస్ కసరత్తును ప్రారంభించింది. ఢిల్లీలో సోమవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సంఘం (సీఈసీ) సమావేశంలో 12 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. బెంగళూరు దక్షిణ నియోజక వర్గం అభ్యర్థిగా ‘ఆధార్’ చైర్మన్ నందన్ నిలేకనిని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎంపిక చేశారని తెలిసింది. తొమ్మిది మంది ప్రస్తుత ఎంపీలకు తిరిగి టికెట్లు లభించనున్నాయి. బళ్లారి స్థానానికి ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వై. హనుమంతప్ప పేరును ఖరారు చేశారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బెల్గాం స్థానానికి లక్ష్మీ హెబ్బాల్కర్ పేరు ఖరారైంది. సీఈసీ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. కాగా బీజేపీ ఇప్పటికే 21 స్థానాలకు, జేడీఎస్ పది స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశాయి. దక్షిణపై తర్జన భర్జన ప్రతిష్టాత్మక బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజక వర్గానికి నిలేకని పేరును ఖరారు చేయడానికి ముందు కాంగ్రెస్ నాయకులు తీవ్ర తర్జన భర్జన పడినట్లు తెలిసింది. 1991 నుంచి ఆ స్థానం బీజేపీ చేతుల్లోనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి పెట్టని కోట. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత్ కుమార్ వరుసగా ఐదు సార్లు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ అనేక ప్రయోగాలు చేసినప్పటికీ ఫలితం కనబడ లేదు. 1991, 2004 సంవత్సరాల్లో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయింది. ఆ నియోజక వర్గంలో ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, ఈసారి నిలేకని ద్వారా ప్రయోగం చేయదలచుకుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఆ స్థానం నుంచి బరిలో దిగుతోంది. దీంతో కాంగ్రెస్ మాటేమో కానీ, బీజేపీకే వణుకు పుడుతోంది. ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన ‘ప్రి పోల్ సర్వే’లో ఈ స్థానం ఆప్ పాలవుతుందనే అంచనాలు వచ్చాయి. మొత్తం 28 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 13, బీజేపీకి 11, జేడీఎస్‌కు రెండు, ఆప్‌కు ఒక స్థానం దక్కవచ్చని ఆ సర్వే జోస్యం చెప్పింది.