
ఎదురొచ్చిన ఎన్నికకు కలిసొచ్చిన భార్య!
అడిక్‌మెట్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న మహేందర్‌పై రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. డివిజన్‌ను జనరల్ మహిళకు కేటాయించడంతో కంగుతిన్నాడు. ఇంతలో కాబోయే భార్య రూపంలో అదృష్టం వెదుక్కుంటూ వచ్చింది. ... మహేందర్ గత నెల 20న ఆ డివిజన్‌కు చెందిన శాంతిప్రియతో నిశ్చితార్థం చేసుకుని... ఫిబ్రవరి 12న పెళ్లికి సిద్ధమయ్యాడు. రిజర్వేషన్లతో తన కలలు కల్లలైనందున.. కాబోయే భార్యనే పోటీకి దింపితే ఎలా ఉంటుందని ఆలోచించి... పార్టీ పరిశీలకులకు బయోడేటాను అందచేశాడు.
అడిక్‌మెట్ డివిజన్ లలితానగర్ కమ్యూనిటీ హాలుకు వచ్చిన పరిశీలకులు ఇది తెలుసుకుని ఎదురొచ్చిన ఎన్నికలకు కలిసొచ్చే భార్య దొరికిందంటూ చమత్కరించారు.
- ముషీరాబాద్