
గ్రేటర్‌లో ఓటేయలేని ఎంపీ!
టీడీపీ నేత మల్లారెడ్డి...దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి (మల్కాజ్‌గిరి) ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ.
టీడీపీ నేత మల్లారెడ్డి...దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి (మల్కాజ్‌గిరి) ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ. 32 లక్షల మంది ఓటర్లకు ప్రతినిధి. గ్రేటర్ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలూ ఆయన పార్లమెంట్ పరిధిలోనివే. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి నగరంలోనే పెద్ద దిక్కు. అయినా ఆయన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటేయలేరు...ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో నివాసం ఉండడమే కారణం. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని పాలన సాగే ఈ ప్రాంతం భౌగోళికంగా గ్రేటర్‌లో భాగమే అయినప్పటికీ, పాలన పరంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రాదు.
కంటోన్మెంట్ వాసులు గ్రేటర్ ఓటర్లు కారు. ఈ నేపథ్యంలో బోయిన్‌పల్లిలో నివాసముండే ఎంపీ మల్లారెడ్డి ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో ఓటేయలేరు.
- కంటోన్మెంట్