'వాళ్లది రోల్డు గోల్డ్ విజయం' | TRS Victory in ghmc election roll gold win: shabbir ali | Sakshi
Sakshi News home page

'వాళ్లది రోల్డు గోల్డ్ విజయం'

Published Mon, Feb 8 2016 2:18 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

'వాళ్లది రోల్డు గోల్డ్ విజయం' - Sakshi

'వాళ్లది రోల్డు గోల్డ్ విజయం'

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ తెలిపారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇస్తామని చెప్పారు. టీఆర్ఎస్ గెలుపు రోల్డు గోల్డ్ బంగారం తీరుగా ఉందని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై జనం చాలా ఆశలు పెట్టుకున్నారని, లక్ష ఇళ్ల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కోరారు. ఇళ్ల నిర్మాణంపై ఇచ్చిన హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందనే నమ్మకం తనకు లేదన్నారు. గతంలో ఇళ్ల నిర్మాణంపై ఇచ్చిన హామీకి, బడ్జెట్ లో నిధులు కేటాయింపుకు పొంతన లేదని గుర్తు చేశారు. నాడు సాధ్యం కానిది ఇప్పుడు ఎలా సాధ్యమవు తుందని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి నాయకులందరూ సమిష్టి బాధ్యత వహించాలని అన్నారు. ఈవిఎంల ట్యాంపరింగ్ పై పీసీసీ ఐటీ సెల్ ఆధారాలు సేకరిస్తోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement