
ఉద్యోగం వద్దు.. రాజకీయమే ముద్దు
రాజకీయం.. దానిని మించిన ఉద్యోగం, ఉపాధి, పలుకుబడి ఇంకేముందీ ప్రపంచంలో. అందుకేనేమో కార్పొరేటర్ టికెట్ కోసం ఏకంగా ప్రభుత్వ
రాజకీయం.. దానిని మించిన ఉద్యోగం, ఉపాధి, పలుకుబడి ఇంకేముందీ ప్రపంచంలో. అందుకేనేమో కార్పొరేటర్ టికెట్ కోసం ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుంటానంటోంది ఓ మహిళ. టికెట్ ఇస్తే ఉద్యోగానికి రాజీనామ చేస్తానంటూ ప్రచారం నిర్వహిస్తోంది. ఏకంగా రాజీనామా పత్రాన్ని తీసుకొని పార్టీ అధినాయకత్వం వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఉప్పల్‌కు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు తవిడబోయిన గిరిబాబు భార్య ఎం.స్నేహలక్ష్మి పాత బస్తీలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల రిజర్వేషన్లలో భాగంగా ఉప్పల్ డివిజన్‌ను జనరల్ మహిళకు కేటాయించడంతో చేసేది లేక గిరిబాబు తన భార్యను కదన రంగంలోకి దింపుతున్నారు. టికెట్ ఇస్తే తన భార్యచేత ఉద్యోగానికి రాజీనామా చేయిస్తానంటూ రాజీనామా పత్రాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. గతంలో గిరిబాబు కూడా ఎల్‌ఐసీలో ఉద్యోగి. ఆయన కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం విశేషం.
- ఉప్పల్