ఈసారి ‘నోటా’ లేదు
మొత్తం పోలింగ్‌కేంద్రాలు 7,802
మొత్తం అభ్యర్థులు 1,333
► త్వరలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ‘నోటా’ ఆప్షన్ లేదు.
► పెరిగిన ఓటర్ల కనుగుణంగా అదనంగా 45 ఉప పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
► ఐదు వార్డుల్లో అత్యధికంగా 16 మందికి పైగా అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
► నాలుగు వార్డుల్లో అతి తక్కువగా నలుగురు మాత్రమే పోటీ చేస్తున్నారు.
ఈ వివరాలను శనివారం ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్రేటర్ కమిషనర్, ఎన్నికల అధికారి డాక్టర్ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు.
13.87 లక్షల ఓటరు స్లిప్‌లు పంపిణీ
జీహెచ్‌ఎంసీలో మొత్తం ఓటర్లు 74,23,980 మంది కాగా వీరిలో 13,87,000 మందికి వ్యక్తిగతంగా ఓటరుస్లిప్‌ల పంపిణీ జరిగింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా 1,67,000 అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్లు తొలగించారు. వీటిల్లో 66,570 పోస్టర్లు, 46,941 ఫ్లెక్సీలు, 46,627 బ్యానర్లు, 7066 కటౌట్‌లు ఉన్నాయి.
► 16 మందికంటే ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో ఉన్న వార్డులు: జంగమ్మెట్- 28 మంది, సూరారం-21, ఈస్ట్ ఆనంద్‌బాగ్- 18 , రామంతాపూర్-17 , బాలానగర్-17 మంది.
► 16 మంది రంగంలో ఉన్న వార్డులు: చైతన్యపురి, ఓల్డ్‌బోయిన్‌పల్లి
► 15 మంది ఉన్న వార్డులు: లింగోజిగూడ, సుభాష్‌నగర్,మల్కాజిగిరి.
► 13 మంది పోటీ చేస్తున్న వార్డులు: వెంగళ్రావునగర్, మూసాపేట్, నేరేడ్‌మెట్, రామ్‌నగర్.
► 11 వార్డుల్లో 12 మంది చొప్పున, 15 వార్డుల్లో 11 మంది, 18 వార్డుల్లో పదిమంది చొప్పున పోటీలో ఉన్నారు.
► నలుగురు మాత్రమే బరిలో ఉన్న వార్డులు: చావుని, నవాబ్‌సాహెబ్‌కుంట, సులేమాన్‌నగర్, దత్తాత్రేయనగర్, గోల్కొండ, నానల్‌నగర్, అహ్మద్‌నగర్, చందానగర్
కనీస సదుపాయాలు..
పోలింగ్ స్టేషన్ల వద్ద తాగునీరు, విద్యుత్, టాయ్‌లెట్స్, ర్యాంపులు, ఎండ త గలకుండా పైకప్పులు, అవసరమైన ర్యాంపులు తదితరమైనవి ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచించారు. వీటికోసం రూ. 3.33 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.