సాక్షి, ముంబై: ముంబై, ఠాణే పరిధిలోని అన్ని లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండి యా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐ ఎం) పార్టీ నిర్ణయించింది. తొలుత ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాద్, ఆ తరువాత మరాఠ్వాడాలలో సత్తా చాటుకున్న ఈ పార్టీ ఇప్పుడు ముంబై, ఠాణేలలోనూ పాగా వేయాలని యోచి స్తోంది. ఈ నిర్ణయం ముంబై, ఠాణే పరిసర ప్రాం తాల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై తీవ్ర ప్రభా వం చూపే ఆస్కారముంది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో అత్యధిక శాతం మైనారిటీలు తమ ఓట్లను ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదానికి వేసేవారు.
అయితే ఇకమీదట జరగనున్న ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఈ రెండు పార్టీలకు దిగులు పట్టుకుంది. హైదరాబాద్‌లో ఆవిర్భవించిన ఎంఐఎం నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంసీ) ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా పోటీచేసి ఎనిమిది మంది కార్పొరేటర్లను గెలిపించుకుంది. దీంతో ఈ పార్టీ ప్రాబల్యంపై సర్వత్రా చర్చ జరి గింది. మరాఠ్వాడా తరువాత దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై పరిసర ప్రాంతాల నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ అన్నివిధాలుగా సన్నద్ధమవుతోంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో ముంబై, ఠాణే పరిసర ప్రాంతాల్లోని అన్ని లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.
ఇటీవల జరిగిన అనేక బహిరంగ సభల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదిలాఉంచితే మైనారిటీ యువతను ఆకట్టుకునేం దుకు ఒవైసీ శాయశక్తులా ప్రయత్నించారు. దీంతో ఆ వర్గానికి చెందిన యువత ఆయనకు బాగా దగ్గరైందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ప్రాబల్యాన్ని మహారాష్ట్రలోనూ విస్తరిం చాలని ఒవైసీ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల బరిలోకి ఎంఐఎం దూకితే అత్యధిక శాతం ముస్లిం ఓట్లు ఆ పార్టీకే పడే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఇదే జరిగితే అనేక దశాబ్దాలుగా ముస్లిం ఓట్ల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటున్న కాం గ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బతగలడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు మహారాష్ట్రలో తమ పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న సమాజ్‌వాదీ పార్టీకి కూడా ఇదే పరిస్థితి ఎదురుకానుంది. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు వేసుకున్న అంచనాలు ఎంఐఎం కారణంగా తారుమారయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ఆ రెండు పార్టీలకు చెంది న నాయకుల్లో కలవరం మొదలైంది.
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు తిప్పలే
Published Mon, Nov 25 2013 12:20 AM | Last Updated on Mon, Oct 8 2018 8:39 PM
Advertisement
Advertisement