మజ్లిస్‌ కోసమే ‘విమోచన’ జరపడం లేదు | BJP to Embarrass TRS on Telangana 'Liberation' Day | Sakshi
Sakshi News home page

మజ్లిస్‌ కోసమే ‘విమోచన’ జరపడం లేదు

Published Fri, Jul 21 2017 1:51 AM | Last Updated on Mon, Oct 8 2018 8:39 PM

మజ్లిస్‌ కోసమే ‘విమోచన’ జరపడం లేదు - Sakshi

మజ్లిస్‌ కోసమే ‘విమోచన’ జరపడం లేదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌: మజ్లిస్‌ కోసమే సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 17న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. మజ్లిస్‌ కోసం సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో సెప్టెంబర్‌ 10, 11, 12 తేదీల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 22, 23న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వరంగల్‌లో జరుగుతాయన్నారు. ఆగస్టు 10 నుంచి 20 వరకు ప్రజాసమస్యలపై మండలస్థాయిలో, ఆ తరువాత జిల్లా స్థాయిలో ఉద్యమాలు ఉంటాయన్నారు. అక్టోబర్‌లో రాష్ట్రస్థాయి కార్యాచరణ ఉంటుందన్నారు. అక్టోబరు, నవంబరు నెలల్లో పోలింగ్‌బూత్‌ స్థాయి కార్యకర్తలతో సమావేశాలుంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement