Dr. K. Laxman
-
‘మోదీ పర్యటనపై కేసీఆర్‌కు కడుపు మంట ఎందుకు?’
న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకుంటామనే హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ, డాక్టర్ లక్ష్మణ్. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రధాని పర్యటన అడ్డుకుంటామని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశలను కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈనెల 11, 12వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని హాజరవుతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించనున్నారని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ‘కేంద్ర నిధుల సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ప్రధాని. బీజేపీని, మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రధాని పర్యటన అడ్డుకుంటామని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి పనులను ఎదుర్కొనే సామర్థ్యం బీజేపీకి ఉన్నది.. అందుకే మునుగోడులో 40శాతం ఓట్లు బీజేపీకి వేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ. 6,000 కోట్ల పైచిలుకు నిధులతో పునరుద్ధరించారు. దాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని వస్తుంటే అడ్డుకుంటామని అంటున్నారు. లెఫ్ట్ పార్టీలో నేతలు కేసీఆర్ కనుసనల్లో ఉన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఎరువుల కర్మాగారం ఓపెన్ చేస్తుంటే కేసీఆర్‌కి వచ్చిన కడుపు మంట ఏంటి? తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తామని కేసీఆర్ చెప్పారు ఏమైంది? హింసను పేరేపించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. అందులో కమ్యూనిస్టులు చలి కాల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రొటోకాల్ రగడ!.. కేసీఆర్‌ను పిలవరా? -
మజ్లిస్ కోసమే ‘విమోచన’ జరపడం లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ కోసమే సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 17న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. మజ్లిస్ కోసం సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో సెప్టెంబర్ 10, 11, 12 తేదీల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 22, 23న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వరంగల్‌లో జరుగుతాయన్నారు. ఆగస్టు 10 నుంచి 20 వరకు ప్రజాసమస్యలపై మండలస్థాయిలో, ఆ తరువాత జిల్లా స్థాయిలో ఉద్యమాలు ఉంటాయన్నారు. అక్టోబర్‌లో రాష్ట్రస్థాయి కార్యాచరణ ఉంటుందన్నారు. అక్టోబరు, నవంబరు నెలల్లో పోలింగ్‌బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలుంటాయన్నారు. -
నేడు రాష్ట్రానికి అమిత్ షా
-
నేడు రాష్ట్రానికి అమిత్ షా
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం(20న) రాష్ట్రానికి రానున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లా డారు. శుక్ర, శనివారాల్లో (20, 21న) భద్రాచలంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని చెప్పారు. పార్టీని బలో పేతం చేసేందుకు అమిత్‌షా తెలంగాణపై దృష్టి సారించారని, అందులో భాగంగా రాష్ట్రంలో పర్యటించనున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం గురించి అసెంబ్లీలో చర్చించామని, ఫీజు రీయింబర్స్మెంట్, రుణ మాఫీ, డబుల్ బెడ్రూం తదితర పథకాల గురించి ప్రశ్నించామన్నారు. -
అలా మాట్లాడటం కేసీఆర్ కు తగదు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్‌ను కొత్త బిచ్చగాడని సంభోధించడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హోదాకు తగిని విధంగా లేదని తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చ ప్రధానకార్యదర్శి కాటం నర్సింహ్మాయాదవ్ విమర్శించారు. బర్కత్‌పురలోని బీజేపీ గ్రేటర్ కార్యాలయంలో శనివారం రాత్రి జరిగిన సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా సీఎం బాష మారక పోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్రానికి నిధులు కావాలన్నప్పుడు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను పొగిడి ఈ రోజు దత్తాత్రేయను, డాక్టర్ లక్ష్మణ్‌ను సోయిలేదనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బీసీ నాయకులైన ఈ ఇద్దరిని దొరలమనే ఆహంకారంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. -
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్
పలు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. తెలంగాణ రాష్ట్రానికి డాక్టర్ కె. లక్ష్మణ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుతం ఆయన ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న లక్ష్మణ్‌కు ఈ అధ్యక్ష పదవి లభించింది. ఇక కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు అవకాశం కల్పించారు. కొన్నాళ్ల పాటు బీజేపీకి దూరమై సొంత కుంపటి పెట్టుకున్న యడ్యూరప్ప.. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరి, ఏకంగా అధ్యక్ష పదవిని కూడా చేపడుతుండటం విశేషం. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కేశవ ప్రసాద్ మౌర్య, పంజాబ్ బీజేపీ చీఫ్‌గా విజయ్ సంప్లా, అరుణాచల్ పార్టీ అధ్యక్షుడిగా తపిర్ గావోలను అధిష్ఠానం నియమించింది. -
రైతు ఆత్మహత్యలపై సమరమే: బీజేఎల్పీ
అసెంబ్లీలో సర్కారును నిలదీస్తాం: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. సోమవారం అసెంబ్లీలో శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సమావేశం వివరాలను డాక్టర్ కె.లక్ష్మణ్ మీడియాకు వివరించారు. శాసనసభలో నిలదీస్తామనే భయంతోనే రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన 2014 జూన్ 2 తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలన్నింటికీ పెంచిన రూ. 6 లక్షల పరిహారం ఎందుకు ఇవ్వడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ సంక్షోభానికి కారణాలు, ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళిక, రుణమాఫీ, కరువు మండలాల ప్రకటనలో నిర్లక్ష్యం వంటి అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో డెంగీ, స్వైన్‌ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు తీవ్రంగా ఉంటే వైద్య శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, వీటిపై సమగ్రంగా చర్చించడానికి అసెంబ్లీని 3 వారాలపాటు జరపాలని డిమాండ్ చేశారు. నవంబర్ ఆఖరులోగా రాష్ట్ర కమిటీ: సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు బీజేపీ రాష్ట్ర కమిటీ ఉపక్రమించింది. నవంబర్ ఆఖరులోగా రాష్ట్ర కమిటీకి సంస్థాగత ఎన్నికలను పూర్తిచేయడానికి ఎన్నికల అధికారిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన భూపతిరెడ్డిని జాతీయ పార్టీ నియమించింది. రాష్ట్ర కమిటీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారుల నియామక ప్రక్రియను కూడా పూర్తిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీలను అక్టోబర్‌లో పూర్తిచేయనున్నారు. -
మోడీ ఎంపిక బీజేపీ సంప్రదాయానికి చిహ్నం
హైదరాబాద్ : ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఎంపిక బీజేపీ సంప్రదాయానికి చిహ్నమని ఆపార్టీ నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. 2014 ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ప్రధాని అభ్యర్థి విషయంలో కూడా స్పష్టత లేదని లక్ష్మణ్ శనివారమిక్కడ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభంజనం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.