నేడు రాష్ట్రానికి అమిత్‌ షా | today Amit Shah visits telanga for bjp strong | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్రానికి అమిత్‌ షా

Published Fri, Jan 20 2017 2:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నేడు రాష్ట్రానికి అమిత్‌ షా - Sakshi

నేడు రాష్ట్రానికి అమిత్‌ షా

హైదరాబాద్‌: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా శుక్రవారం(20న) రాష్ట్రానికి రానున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లా డారు. శుక్ర, శనివారాల్లో (20, 21న) భద్రాచలంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని చెప్పారు. పార్టీని బలో పేతం చేసేందుకు అమిత్‌షా తెలంగాణపై దృష్టి సారించారని, అందులో భాగంగా రాష్ట్రంలో పర్యటించనున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యం గురించి అసెంబ్లీలో చర్చించామని, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణ మాఫీ, డబుల్‌ బెడ్‌రూం తదితర పథకాల గురించి ప్రశ్నించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement