బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్‌ను కొత్త బిచ్చగాడని సంభోధించడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హోదాకు తగిని విధంగా లేదని తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చ ప్రధానకార్యదర్శి కాటం నర్సింహ్మాయాదవ్ విమర్శించారు. బర్కత్‌పురలోని బీజేపీ గ్రేటర్ కార్యాలయంలో శనివారం రాత్రి జరిగిన సమావేశంలో మాట్లాడారు.
ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా సీఎం బాష మారక పోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్రానికి నిధులు కావాలన్నప్పుడు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను పొగిడి ఈ రోజు దత్తాత్రేయను, డాక్టర్ లక్ష్మణ్‌ను సోయిలేదనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బీసీ నాయకులైన ఈ ఇద్దరిని దొరలమనే ఆహంకారంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
అలా మాట్లాడటం కేసీఆర్ కు తగదు
Published Sun, May 22 2016 6:27 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement