
ఎంఐఎం నేతలతో బొత్స భేటీ
మున్సిపల్, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దూసుకు వస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీతోపాటు పలు పార్టీలు ఇతర పార్టీలతో పొత్తుల కోసం తహతహలాడుతున్నాయి.
మున్సిపల్, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దూసుకు వస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీతోపాటు పలు పార్టీలు ఇతర పార్టీలతో పొత్తుల కోసం తహతహలాడుతున్నాయి. అందులోభాగంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం ఎంఐఎం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో హైదరాబాద్లో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికలలో కలసి పోటీ చేయాలని ఒవైసీతో బొత్స ప్రతిపాదించారు. అయితే, తమ పార్టీలో చర్చించిన తర్వాత గానీ ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోలేమని, పొత్తు అంశాన్ని పార్టీలో ప్రస్తావనకు పెడతానని సీనియర్ ఒవైసీ అన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఎంఐఎంతో కలసి ఎన్నికల సమరానికి సన్నద్ధం కావాలని ఆలోచనలో ఉన్నారు. అందుకోసం ఇప్పటికే ఆయన కుమారుడు, ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఒకవైపు ఎంఐఎంతోను, మరోవైపు వామపక్షాలతోను చర్చలు జరుపుతున్నారు.