రజ్వీ నుంచి పుట్టిందే మజ్లీస్‌:లక్ష్మణ్‌ | laxman comments on majlis party | Sakshi
Sakshi News home page

రజ్వీ నుంచి పుట్టిందే మజ్లీస్‌:లక్ష్మణ్‌

Published Wed, Jul 20 2016 11:37 PM | Last Updated on Mon, Oct 8 2018 8:39 PM

మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ - Sakshi

మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌

మలక్‌పేట: రజాకార్లకు నాయకుడు కాసీం రజ్వీ భావజాలంతోనే మజ్లీస్‌ పార్టీ ఆవిర్భవించిందని, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ అన్నారు. ఐసిస్‌ ఉగ్రవాదులకు న్యాయ సహాయం చేస్తామని ఎంపీ అసదుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలకు  నిరసనగా బుధవారం బీజేపీ మలక్‌పేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరాన్ని మజ్లీస్‌ కబంధ హస్తలనుంచి విముక్తం చేసేందుకు సంతకాలు సేకరించి గవర్నర్‌కు అందజేస్తామన్నారు.

దేశ ఆర్ధికస్థితిని అస్తవ్యస్తం చేసేందుకు కుట్ర పన్నుతున్న ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులకు, శక్తులకు ఎంఐఎం అండగా నిలుస్తోందన్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ హిందువుల మనోభావాను కించపరిచేలా మాట్లాడినందుకు కేసులు పెట్టినా చర్యలు తీసుకోక పోవడం దారుణమన్నారు. ఎంపీ సభ్యత్వం రద్దుకు చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ నైజం, మజ్లీస్‌ ఆగడాలపై ఇంటింటి ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో  చింతా సాంబమూర్తి, వెంకటేశ్వర్లు,  వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement