సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా మజ్లిస్ -ఇత్తేహదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ఆరు అసెంబ్లీ స్థానాలకు మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి మీర్ మజాజ్ అలీ, భువనగిరి స్ధానానికి మోతీలాల్ నాయక్, పటాన్‌చెరు స్థానానికి సయ్యద్ రహమత్, అంబర్‌పేట స్థానానికి నలిగంటి శరత్, సికింద్రాబాద్ స్థానానికి జెమ్స్ సిల్వేస్టర్, జూబ్లీహిల్స్ స్థానానికి నవీన్‌యాదవ్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్లు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఇది వరకు ఎంఐఎం హైదరాబాద్ నగరంలోని కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం విదితమే.