పేదల పక్షాన మజ్లిస్
⇒ పేదలకు రూ. 5కే భోజనం స్వచ్ఛమైన తాగు నీరు..
⇒ తొలిసారి గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
సిటీబ్యూరో: ఆల్ ఇండియా మజ్లిస్-ఏ- ఇత్తేహదుల్ ముస్లిమీన్ పార్టీ పేదల పక్షాన నిలుస్తుందని, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, నిరుపేదలకు రూ. 5 కే భోజనం అందించడమే తమ ఎన్నికల అజెండా అని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మజ్లిస్ తొలిసారి జీహెచ్‌ఎంసీ -2016 ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం అసద్ విడుదల చేశారు.
మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..
గ్రేటర్‌లో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల అభివృద్ధి, నూతనంగా మల్టీలెవల్ ఫై ్లఓవర్స్ నిర్మాణం. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, మీర్ ఆలం ట్యాంక్ సుందరీకరణ.నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సమీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ అమలు. మరిన్ని బస్‌షెల్టర్లు, ప్రత్యేక బస్సు మార్గాల (బస్‌బే) ఏర్పాటు. సిటీ ఆర్టీసీ బస్సుల నష్టాన్ని జీహెచ్‌ఎంసీ భరించడానికి వ్యతిరేకం నగరవ్యాప్తంగా ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు కంప్యూటర్ ఆధారంగా నిర్వహణ. ఘన వ్యర్థాల నిర్వహణకు పక్కా ప్రణాళిక అమలు. మరిన్ని స్వీపింగ్ యూనిట్ల ఏర్పాటు, చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు. శివారు ప్రాంతాల్లో నాలాల విస్తరణ, విస్తరణతో ఆస్తులు కోల్పోయేవారికిమెరుగైన పరిహారం అందజేత.
గ్రేటర్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా. మురికివాడల్లో తాగునీటిని శుద్ధి చేసేందుకు 1500 ఆర్‌ఓ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు. భూగర్భజలాలను పెంచేందుకు వర్షపునీటి సంరక్షణకు చర్యలు. నగరంలోని పేదలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందజేత. ఇందుకోసం మరిన్ని భోజన కేంద్రాల ఏర్పాటు.గౌలిపురా, అంబర్‌పేట, న్యూ బోయిగూడ, జియాగూడ, చంచల్‌గూడలో ఆధునిక కబేళాల ఏర్పాటు.నగరంలోని ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి కృషి. 112 అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీ, కొత్తగా 33 అర్బన్ హెల్త్ సెంటర్ల మంజూరు.నగరంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడల ప్రోత్సాహానికి మినీ, మల్టీపర్పస్‌స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రీడా మైదానాలు వ్యాయామ కేంద్రాల ఏర్పాటు. క్రీడా ఫెలోషిప్ పథకం అమలు.
సిటీలో సుమారు 1000 ఈ-లైబ్రరీల ఏర్పాటు, రీడింగ్ రూమ్స్ పథకం పునఃప్రారంభం.విపత్తు నివారణ ప్రణాళికలకు రూపకల్పన. వీధి వ్యాపారుల రక్షణ చట ్టం అమలు చేస్తాం. వీధి వ్యాపారాల కోసం హాకర్స్ జోన్స్ ఏర్పాటు.నగరానికి 40 టీఎంసీల కృష్ణా, గోదావరి జలాలు కేటాయించే విధంగా చర్యలు, రెండు స్టోరేజ్ ప్లాంట్ అమలు, శామీర్‌పేట, చౌటుప్పల్‌లో 40 టీఎంసీల స్టోరేజ్ ప్లాంట్లు నిర్మాణం. ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పూర్తి. విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల సౌకర్యం. నగర ంలో సీసీ టీవీల నిఘా విస్తరణ.