బల్దియా పీఠం మాదే: అసదుద్దీన్ | Baldiya seat ours: asaduddin | Sakshi
Sakshi News home page

బల్దియా పీఠం మాదే: అసదుద్దీన్

Published Mon, Jan 4 2016 4:08 AM | Last Updated on Mon, Oct 8 2018 8:39 PM

బల్దియా పీఠం మాదే: అసదుద్దీన్ - Sakshi

బల్దియా పీఠం మాదే: అసదుద్దీన్

హైదరాబాద్: ‘గ్రేటర్’ ఎన్నికల్లో విజయం తమదేనని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం రాత్రి గోల్కొండ సీరత్ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ మిలాద్ గ్రౌండ్‌లో జరిగిన జల్సా మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నారు. నగర ప్రజలు మజ్లిస్ పార్టీని ఆదరిస్తున్నారనీ, తాము ఎలాంటి ఎన్నికల హామీలు ఇవ్వమని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని తమకు బలమున్న స్థానాల్లోనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సెక్యులర్ పార్టీలకు మద్దతు ఇస్తామని, అదేవిధంగా అవసరమైతే  వారి నుంచి మద్దతు తీసుకుంటామని తెలిపారు. కొందరు యువకులు ఇస్లాం పట్ల సరైన అవగాహన లేక ప్రలోభాలకు లొంగి విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement