హిందుస్థాన్ జిందాబాద్’ | Hindustan Zindabad ' | Sakshi
Sakshi News home page

హిందుస్థాన్ జిందాబాద్’

Published Tue, Mar 29 2016 2:02 AM | Last Updated on Mon, Oct 8 2018 8:39 PM

హిందుస్థాన్ జిందాబాద్’ - Sakshi

హిందుస్థాన్ జిందాబాద్’

సిటీబ్యూరో: మహా నగరంలోని ముఖ్య కూడళ్లలో ‘హిందుస్థాన్ జిందాబాద్’ ‘ఐ లవ్ మై ఇండియా’ అంటూ  మజ్లిస్ పార్టీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీ, కటౌట్‌లు  ఏర్పాటు చేస్తోంది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాను ఎట్టి పరిస్థితుల్లో ‘భారత్ మాతాకీ జై’ అననని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం విదితమే.

అదేవిధంగా ఆ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సైతం అక్కడి అసెంబ్లీలో అదే వ్యాఖ్యలు చేసి సస్పెండైన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ఎంఐఎం పార్టీ ముఖ్యనేత షాబాజ్ ఖాన్ ముఖ్య కూడళ్లలో ‘ హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ పార్టీ అధినేత, అగ్రనేతలతో కూడిన ఫోటోలతో పెద్దఎత్తున ఫ్లెక్సీ, కటౌట్‌లను ఏర్పాటుచేయడం పలువురిని ఆకర్షిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement