ఏపార్టీతో పొత్తు పెట్టుకోలేదు: ఓవైసీ
ఏపార్టీతో పొత్తు పెట్టుకోలేదు: ఓవైసీ
Published Thu, Apr 3 2014 5:09 PM | Last Updated on Mon, Oct 8 2018 8:39 PM
హైదరాబాద్: అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదని మజ్లీస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లీమీన్(ఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోకసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఒంటిరిగానే పోటి చేస్తున్నాం అని ఓవైసీ తెలిపారు. ఎంఐఎంతో జత కట్టేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఆసక్తి చూపుతున్నాయని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటికే ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంఐఎం ఖరారు చేసింది. ఇద్దరు కొత్త అభ్యర్థులకు ఎంఐఎం చోటు కల్పించింది.
రానున్న ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో అభ్యర్థులను నిలబెడుతామని ఓవైసీ తెలిపారు. హైదరాబాద్ లోకసభ స్థానంలో హ్యట్రిక్ విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఓవైసీ ప్రయత్నిస్తున్నారు. నగరాభివృద్దే ప్రధాన ఎజెండా అని ఆయన అన్నారు. హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రాంత ప్రజలకు భద్రత కల్పిస్తామని ఓవైసీ భరోసా ఇచ్చారు. 1984 నుంచి ఎంఐఎం హైదరాబాద్ లోకసభ స్థానంలో విజయం సాధిస్తోంది.
Advertisement