సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాన్స్‌లేటర్స్ పేరుతో కొందరు దారణమైన దోపిడిలకు పాల్పడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన రోగులను టార్గెట్‌గా చేసుకుని దందాలు చేస్తున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇతర దేశాస్తులు బాష రాకపోవడంతో ప్రతి విషాయానికి ట్రాన్స్‌లేటర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని వారి వద్దనుంచి లక్షల సొమ్మును కాజేస్తున్నారు. ఈ దందా నగరంలో ఎక్కువగా ఆస్పత్రుల వద్ద సాగుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే బంజారాహీల్స్‌లో వెలుగులోకి వచ్చింది.
మిడిల్ ఈస్ట్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల ఆనారోగ్యం కారణంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోరకు చేరింది. ఇక్కడి భాష రాకపోవడంతో ఓ ట్రాన్స్‌లేటర్‌ను నియమించుకుంది. గాల్ బ్లాడర్‌లో ట్యామర్ ఉండడంతో ఆసుపత్రిలో చేరిన ఆమెను తప్పుడు సమాచారంతో మోసం చేశాడు. బ్లాడర్ మార్పిడితో పాటు డబ్బు విషయంలో కూడా అబద్దాలు చెప్పి.. రూ. 3లక్షల బిల్లును రూ. 7లక్షలుగా చెప్పి దోపిడికి పాల్పడ్డాడు. విషయం తెలుకున్న మహిళ షాక్‌కు గురైంది. అనంతరం బంజారాహీల్స్ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment