పాఠ్యాంశంగా ‘ఎమర్జెన్సీ’: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: ఎమర్జెన్సీ దుష్ఫలితాలు, రాజ్యాంగ దుర్వి నియోగాన్ని భావితరాలకు తెలి పేందుకు పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్ర మంత్రి వెం కయ్యనాయుడు సూచించారు. ఎమర్జెన్సీ ని చీకటిరోజుగా అభివర్ణిస్తూ ప్రజా స్వామిక భారతదేశంలో ఎమర్జెన్సీని మించిన చెడు నిర్ణయం లేదన్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, వాటి ఫలితాలు భావితరాలకు తెలియాల్సిన అవసరముందన్నారు. ఆదివారం హైదరా బాద్‌లో జరిగిన సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ.. అప్రజాస్వామిక, నియం తృత్వ నిర్ణయానికి 1977లోనే కాకుండా మొన్నటి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.
ఎమర్జెన్సీ కాలంలో రాజకీయాల్లో విపక్షనేతలు, మీడియా నిర్వాహకులు, ఉద్యమకారులు, న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. సెన్సార్‌ను అంగీకరించని పత్రికలను వెలువరించకుండా చేశారని, ప్రతిపక్షనేతలను జైళ్లలో పెట్టార ని, ప్రశ్నించిన సొంత పార్టీ నేతలనూ ఇందిరాగాంధీ వేధిం చారన్నారు. ఎన్నికల గడువును ఐదేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచారని, ఇలాంటి అవకాశమే ఉంటే పదవుల నుంచి ఎవరూ దిగరని పేర్కొన్నారు.
మారువేషాల్లో తిరిగాం: దత్తాత్రేయ
కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ది ఇప్పటికీ ఎమర్జెన్సీ తరహా ఆలోచనా విధానమేనన్నారు. బ్రిటీష్ వారితో స్వాతంత్రం కోసం పోరాడినట్టే కాంగ్రెస్‌తో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశామన్నారు. ఎమర్జెన్సీ సమయంలో దేశాన్ని జైలుగా మార్చారని, మారువేషాల్లో తిరిగామని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నేటి తరానికి తెలియాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు.