mental tension
-
మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
మీరు.. మీ పిల్లల ఆలోచనలను, వారి నడవడికను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారా? అయితే.. అది మీకు, మీ పిల్లలకి మధ్య భావోద్వేగ అంతరానికి కారణం కావచ్చు. ఈ దూరాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం మీ పిల్లలతో చాలా మాట్లాడటం. కొన్ని ప్రశ్నలు అడుగుతూండటం చేయాలి. మీరడిగే ప్రతీది వారి మనస్సును మలుచుకోవడంలో సహాయమవుతుంది. భావోద్వేగాలను పంచుకోవడంలో తోడ్పడుతుంది. అలాగే, వారిలో పాతిపెట్టిన విషయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలా చేసి చూడండి!ప్రతీ తల్లితండ్రులు తమ పిల్లలను అడగాల్సిన ప్రశ్నలివే..1. 'నీవు ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తావు?'.. అనే ఈ ప్రశ్న అడగడంతో.. పిల్లవాడిని ఆలోచించేలా చేస్తాయి. దీంతో మీరు అతని అంతర్గత ఆలోచనలు, సమస్యలను మెరుగైన మార్గంలో ఉంచగలుగుతారు. ఇలాంటి విషయాలను తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్‌గా అడగడమే ఉత్తమం.2. 'నీకు నచ్చే విషయమేంటి? ఎలా సంతోషంగా ఉంటావ్?'.. ఈ ప్రశ్న అతనికి తన గురించి చెప్పే అవకాశాన్ని ఇస్తుంది. దీంతో తన కోరికలను వ్యక్తం చేయగలడు.3. మీరు మీ పిల్లల్ని తప్పకుండా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే? 'నేను మీతో తక్కువ లేదా ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది?' ఈ విధంగా సూటిగా చూస్తూ అడగడంతో.. వారి కళ్ళ నుంచి మీకు, మీ బిడ్డకు మధ్య ఉన్న సరైన బంధాన్ని అర్థం చేసుకోగలరు.4. పిల్లలు పెరుగుతున్నప్పుడు.. తరచుగా కొన్ని ఆలోచనలలో మునిగిపోతూంటారు. ఆ సమయంలో మీరు వారిని తప్పకుండా అడగాల్సిన విషయం ఇదే.. 'నీ జీవితంలో నీవు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏదైనా సమస్యా?' అని అడగడంతో వారిలో ఏదైనా ప్రశ్న ఉన్నా భయ సంకోచాన్ని వదిలేస్తారు.5. 'కుటుంబంతో నీవు కలిగి ఉన్న ఉత్తమ జ్ఞాపకం ఏంటి?' ఇలా అడిగితే.. వాళ్లు కుటుంబంతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. పిల్లలు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో కూడా మీరు అర్థం చేసుకుంటారు.6. 'ఒత్తిడికి లేదా ఆందోళనకు గురికావడం వంటివి ఏవైనా ఉన్నాయా?' ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే? నేటి జీవనశైలిలో 'మానసిక ఒత్తిడి' పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. వారి వ్యక్తిత్వ ఎదుగుదలపై ప్రభావితం చూపుతుంది. ఈ ఒత్తిడిని పెద్దలు నిర్వహించగలరు. కానీ పిల్లలు తరచుగా ఈ సమస్యలలో చిక్కుకుంటున్నారు. దీని పర్యవసానాలు చాలా ప్రమాదకరమైనవి. కనుక వారిని తరచుగా అడగండి.. ఒత్తిడి నుంచి ఎలా బయటపడాల్లో నేర్పించండి.7. 'మీరు నాతో ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా!' అని అడగడంతోపాటు వారి ఆశను నెరవేర్చాలి. ఎందుకంటే? పిల్లలు తరచుగా ఒంటరిగా ఉంటారు. తల్లిదండ్రులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపాలని లోలోనే తపిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో వారితో కలిసి కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవడంలో మంచి అవకాశాన్ని ఇస్తుంది. -
గీతాంజలి ఆత్మహత్య: ట్రోలింగ్..కిల్లింగ్ కేన్సర్!
నిపుణులు, టెక్నాలజీ పెద్దలు ఊహించినట్టుగానే సోషల్ మీడియా పెద్ద ప్రమాదంగా పరిణమిస్తోంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా జ్ఞానాన్ని, సమాచారాన్ని పంచాల్సిన టెక్ విప్లవం కాస్తా మనుషుల ప్రాణాల్ని బలితీసుకుంటోంది. హద్దూ, పద్దూ లేని సోషల్ మీడియా యూజర్లు విచక్షణా రహితంగా వేధిస్తున్నారు. కేన్సర్‌లా విస్తరిస్తున్న ఈ ట్రోలింగ్ చాలామందిని మానసికవేదన గురిచేస్తోంది. చివరికి తట్టుకోలేక ముఖ్యంగా మహిళలు తమ ఉసురు తీసుకుంటున్నారు. తెనాలికి చెందిన ఇద్దరు బిడ్డల తల్లి గీతాంజలి విషాద గాథ ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు , యూ ట్యూబ్ తదితర ఆన్లైన్ ఫార్మాట్లో చోటు చేసుకునే ఈ వేధింపులు మహిళలు, పిల్లల పాలిట అత్యంత ప్రమాదకరకరంగా మారుతున్నాయి. మహిళా రాజకీయ నేతలు, సెలబ్రిటీల నుంచి సామాన్య మహిళల దాకా నెట్టింట ట్రోలింగ్ భరించలేని మానసిక క్షోభకు గురి చేస్తోంది. కూచుంటే తప్పు..లేస్తే తప్పు అన్నట్టు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి తమ అభిమాన నాయకుడి మీద అభిమానాన్ని చాటుకోవడం కూడా నేరంగా మారిపోయింది. అల్లరి మూకల దారుణమైన వ్యాఖ్యల్ని తట్టుకోలేక గీతాంజలి తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమే. కానీ ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్త, ముద్దులొలికే ఇద్దరు చిన్నారులను కూడా కాదని ఇంతటి నిర్ణయం తీసుకుందంటే ఈ ట్రోలింగ్ మూకల ఆగడాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మహిళా సెలబ్రిటీలు, హీరోయిన్ల విషయంలో అయితే మరీ రెచ్చిపోతారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా, నటి అనసూయ, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ఆఖరికి మహిళా ఉద్యమనేతలు సంధ్య, దేవీ లాంటివాళ్లపై దుర్బాషలాడుతూ, చదవలేని రీతిలో కామెంట్లు పెడుతూ ట్రోల్స్ చేస్తుంటారు. ఇక సినిమా పరిశ్రమలోని మహిళల పరిస్థితి మరీ దారుణం. లేటుగా పెళ్లి చేసుకుంటే.. తప్పు...లేటుగా గర్భం ధరిస్తే తప్పు.. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడం, కమెంట్లు చేయడం పరి పాటిగా మారిపోయింది. ఇదే వ్యాఖ్యలు ఒక హీరో మీద చేయగలరా? భార్య ఉండగానే మరో మహిళతో బిడ్డనికంటూ, చట్టాలను గౌరవించకుండా వరుస పెళ్లిళ్లతో సమాజానికే సిగ్గు చేటుగా మారుతున్న హీరోల నైజాన్ని ప్రశ్నించగలరా? చీడపురుగులా వ్యాపిస్తున్న ట్రోలింగ్‌కు ఇకనైనా అడ్డుకట్టపడాలి. దీన్నిపెంచి పోషిస్తున్న వారెంతటివారైనా తగిన శిక్షలు పడాలి. అపుడు మాత్రమే ట్రోలింగ్ భూతం అంతమవుతుంది. అలాగే మనుషులుగా మనం కూడా విచక్షణ కోల్పోకూడదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యతలు వారికి ఉంటాయనే విషయాన్ని మర్చిపోకూడదు. పరస్పరం గౌరవించుకోవాలి. అదే గీతాంజలికి మనం అర్పించే ఘన నివాళి అవుతుంది. -
ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్!
ముందు రోజు రాత్రివిధులు నిర్వహించి వచ్చాడు ఆ డ్రైవర్.. మరుసటి రోజు రాత్రి విధులకు వెళ్లేలోపు కనీసం నాలుగు గంటలన్నా నిద్రపోవాలి.. కానీ దగ్గరి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లాల్సి ఉంది, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పగటి పూట వేడుకలో గడిపి, 110 కి.మీ. దూరంలోని తానుంటున్న పట్టణం నుంచి సొంత వాహనం నడుపుకుంటూ హైదరాబాద్ వచ్చి విజయవాడ బస్సు తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనటంతో మృతి చెందాడు. మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ డ్రైవర్ కొన్నేళ్లుగా కుటుంబ వివాదాలతో సతమతమవుతున్నాడు.. దాదాపు కుటుంబ సభ్యులు వెలివేసినంత పనిచేశారు.. దీంతో అతని మానసిక స్థితి అదుపు తప్పింది. దూరప్రాంత బస్సు కావటంతో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉంటున్నారు. మరో డ్రైవర్ నడుపుతున్నప్పుడు అతను మద్యం సేవిస్తున్నాడు. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఆ రోజు అధికంగా మద్యం తాగి ఉన్నట్టు తేలి అధికారులు కంగుతిన్నారు. అప్పుడు కాని అతన్ని విధుల నుంచి తప్పించలేదు. సాక్షి, హైదరాబాద్: ఇది తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితి. సగటున ఒక్కో బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉంటారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చేది డ్రైవరే. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి డ్రైవర్లపై పర్యవేక్షణే లేకుండా పోయింది. డ్రైవర్ భద్రంగా బస్సును గమ్యం చేర్చటమనేది డ్రైవింగ్ స్కిల్స్ పైనే కాకుండా, అతని మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గతంలో డ్రైవర్‌పై నిఘా, పర్యవేక్షణ ఉండేది. కానీ, క్రమంగా నష్టాలను అధిగమించేందుకు ఆదాయంపైనే దృష్టి కేంద్రీకరించటం మొదలయ్యాక ఇది గతి తప్పింది. ఇప్పుడు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, కచ్చి తంగా ఉన్నంత మంది విధులకు వచ్చేలా చూడ్డానికే అధికారులు పరిమితమవుతున్నారు. వారికి గతంలోలాగా సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విధులు ముగిసిన తర్వాత నుంచి తిరిగి విధులకు వచ్చే వరకు ఆ డ్రైవర్ విషయాన్ని సంస్థ పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వచ్చే సమయానికి అతని మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మద్యం తాగి ఉన్నాడా లేదా అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తేల్చుకుని బస్సు అప్పగిస్తున్నారు. సెలవులు లేక.. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, విశ్రాంతి సమయంలో నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నా, రకరకాల వివాదా లతో మానసికంగా ఆందోళనతో ఉన్నా.. డ్రైవింగ్ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో తనకు సెలవు కావాలంటూ డ్రైవర్లు అడుగుతారు. అయితే, సెలవు ఇస్తే డ్రైవర్ల కొరత వల్ల సరీ్వసునే రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వా రికి సెలవుల్లేక విధులకు హాజరు కావాల్సి వస్తోంది. విజయవాడ మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్.. ఆ రోజు నిద్రలేమితో ఉండి కూడా సెలవుకు దరఖాస్తు చేయకుండా డ్యూటీకి హాజరయ్యాడని తెలిసింది. ఆ విధానమేమైంది..? గతంలో ప్రతి డిపోలో స్పేర్ డ్రైవర్లు ఉండేవారు. డ్యూటీ చేయలేని స్థితిలో డ్రైవర్ ఉంటే అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపే వారు. కానీ 13 ఏళ్లుగా డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకపోవటం, రిటైర్మెంట్లు, మరణించడం, పదోన్నతులు.. వంటి కారణాల వల్ల డ్రైవర్లకు కొరత ఏర్పడింది. గతంలో డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకునే విధానం ఉండేది. ఏవైనా కారణాలతో వారు మానసికంగా కుంగిపోతున్నారా అన్నది సంస్థకు తెలిసే ఏర్పాటు ఉండేది. ప్రతి సంవత్సరారంభంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. వాటికి డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డ్రైవర్ల స్థితిగతులపై ఆర్టీసీకి సమాచారం చేరేది. డ్రైవర్లతోపాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చేసేవారు. డ్యూటీకి–డ్యూటీకి మధ్య చాలినంత నిద్ర ఉండేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు సూచించేవారు. ఇప్పుడు ఆ వారోత్సవాలు సరిగా నిర్వహించటం లేదు. సంవత్సరంలో ఒకసారి ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించేవారు. ఆ వారంలో ఒక్క బస్సు కూడా ప్రమాదానికి గురి కాకుండా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుండేవి. ఇది కూడా వారి నైపుణ్యం, మానసిక స్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు దీన్ని నిర్వహించటం లేదు. వరుస ప్రమాదాలతో.. చాలా విరామం తర్వాత మళ్లీ ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలి వరుస ప్రమాదాలతో సంస్థలో టెన్షన్ నెలకొంది. డ్యూటీకి వచ్చేప్పుడు సరైన స్థితితో డ్రైవర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది అని అధికారులు చెబుతున్నారు. వారు రెస్ట్ సమయంలో తగినంతగా నిద్రపోవటం, సెల్ఫోన్లతో ఎక్కువ సేపు గడపకుండా చూడటం, అనవసర వివాదాలతో ఒత్తిడికి గురికాకుండా చూడటం.. లాంటి అంశాలపై కుటుంబ సభ్యులు దృష్టి సారించాలని చెప్పనున్నారు. కానీ, గతంలో ఉన్నట్టు పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఇది ఫలించే సూచనలు కనిపించటం లేదు. డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గటంతోపాటు డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఉంటే సెలవు ఇచ్చే ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది జరగాలంటే, తాత్కాలిక పద్ధతిలోనైనా డ్రైవర్ల రిక్రూట్మెంట్ ఉండాలని వారు పేర్కొంటున్నారు. -
ఆత్మన్యూనతా భావంతో వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం రూరల్: అనంతపురం రూరల్ పరిధిలోని ఏ నారాయణపురానికి చెందిన వై వెంకటేశ్(28) అనారోగ్యం, మానసిక వేదనతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబకలహాల కారణంగా కొద్దికాలం కిందట భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. దీనికి తోడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు ఎవరూలేరని ఆత్మన్యూనత భావంతో దిగులు చెందిన వెంకటేశ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణం పొందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దీపిక డిప్రెషన్!
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నా ఏదో తెలియని బాధ వేధిస్తున్నట్టుంది సూపర్‌స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనేని. గత ఏడాది ఆరంభంలో దీపిక విపరీతమైన మానసిక ఒత్తిడితో బాధపడిందట. కారణమేంటన్నది బయటకు రాలేదు గానీ... దాని నుంచి బయటపడటానికి తనంతట తానే శ్రమించిందట. అందులో భాగంగా తనలా మెంటల్ టెన్షన్, ఆందోళన, భయంలో కూరుకుపోయినవారికి అండగా నిలబడాలని నిర్ణయించుకుందని సమాచారం. బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకుని మరీ అలాంటి వారికి సహకారం అందిస్తోందిట. ప్రస్తుత లైఫ్స్టైల్లో మెంటల్ హెల్త్ సమస్యలు సాధారణమే అయినా... దాన్ని దూరం చేసేందుకు తగిన నియమాలు పాటించడం లేదనేది అమ్మడి అభిప్రాయం.