మీరు.. మీ పిల్లల ఆలోచనలను, వారి నడవడికను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారా? అయితే.. అది మీకు, మీ పిల్లలకి మధ్య భావోద్వేగ అంతరానికి కారణం కావచ్చు. ఈ దూరాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం మీ పిల్లలతో చాలా మాట్లాడటం. కొన్ని ప్రశ్నలు అడుగుతూండటం చేయాలి. మీరడిగే ప్రతీది వారి మనస్సును మలుచుకోవడంలో సహాయమవుతుంది. భావోద్వేగాలను పంచుకోవడంలో తోడ్పడుతుంది. అలాగే, వారిలో పాతిపెట్టిన విషయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలా చేసి చూడండి!
ప్రతీ తల్లితండ్రులు తమ పిల్లలను అడగాల్సిన ప్రశ్నలివే..
1. 'నీవు ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తావు?'.. అనే ఈ ప్రశ్న అడగడంతో.. పిల్లవాడిని ఆలోచించేలా చేస్తాయి. దీంతో మీరు అతని అంతర్గత ఆలోచనలు, సమస్యలను మెరుగైన మార్గంలో ఉంచగలుగుతారు. ఇలాంటి విషయాలను తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్‌గా అడగడమే ఉత్తమం.
2. 'నీకు నచ్చే విషయమేంటి? ఎలా సంతోషంగా ఉంటావ్?'.. ఈ ప్రశ్న అతనికి తన గురించి చెప్పే అవకాశాన్ని ఇస్తుంది. దీంతో తన కోరికలను వ్యక్తం చేయగలడు.
3. మీరు మీ పిల్లల్ని తప్పకుండా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే? 'నేను మీతో తక్కువ లేదా ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది?' ఈ విధంగా సూటిగా చూస్తూ అడగడంతో.. వారి కళ్ళ నుంచి మీకు, మీ బిడ్డకు మధ్య ఉన్న సరైన బంధాన్ని అర్థం చేసుకోగలరు.
4. పిల్లలు పెరుగుతున్నప్పుడు.. తరచుగా కొన్ని ఆలోచనలలో మునిగిపోతూంటారు. ఆ సమయంలో మీరు వారిని తప్పకుండా అడగాల్సిన విషయం ఇదే.. 'నీ జీవితంలో నీవు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏదైనా సమస్యా?' అని అడగడంతో వారిలో ఏదైనా ప్రశ్న ఉన్నా భయ సంకోచాన్ని వదిలేస్తారు.
5. 'కుటుంబంతో నీవు కలిగి ఉన్న ఉత్తమ జ్ఞాపకం ఏంటి?' ఇలా అడిగితే.. వాళ్లు కుటుంబంతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. పిల్లలు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో కూడా మీరు అర్థం చేసుకుంటారు.
6. 'ఒత్తిడికి లేదా ఆందోళనకు గురికావడం వంటివి ఏవైనా ఉన్నాయా?' ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే? నేటి జీవనశైలిలో 'మానసిక ఒత్తిడి' పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. వారి వ్యక్తిత్వ ఎదుగుదలపై ప్రభావితం చూపుతుంది. ఈ ఒత్తిడిని పెద్దలు నిర్వహించగలరు. కానీ పిల్లలు తరచుగా ఈ సమస్యలలో చిక్కుకుంటున్నారు. దీని పర్యవసానాలు చాలా ప్రమాదకరమైనవి. కనుక వారిని తరచుగా అడగండి.. ఒత్తిడి నుంచి ఎలా బయటపడాల్లో నేర్పించండి.
7. 'మీరు నాతో ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా!' అని అడగడంతోపాటు వారి ఆశను నెరవేర్చాలి. ఎందుకంటే? పిల్లలు తరచుగా ఒంటరిగా ఉంటారు. తల్లిదండ్రులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపాలని లోలోనే తపిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో వారితో కలిసి కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవడంలో మంచి అవకాశాన్ని ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment