
ఘటమెత్తిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కేంద్రంలో జరిగిన ముత్యాలమ్మ ఘట జాతరలో స్థానిక ఎమ్మెల్యే పవిత్ర శాంత ఘటం ఎత్తారు. ముగింపు ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. మొక్కుబడిగా ఘటం మోశారు. స్థానిక కళాకారులతో కలిసి నృత్యం చేశారు.
పూరీలో పర్యటన
కొరాపుట్: కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పూరిలో పర్యటిస్తోంది. కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క నేతృత్వంలో కమిటీ ఆయా ప్రాంతాలను సందర్శించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణా ప్రాంతాల్లో అమలవుతున్న తీరుపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
దివ్యాంగులకు బ్రెయిలీ ఉపకరణాలు
కొరాపుట్: దివ్యాంగులకు బ్రెయిలీ డివైజ్‌ల పంపిణీ జరిగింది. సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని కలక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో స్వయంగా దివ్యాంగ బాలలకు అందజేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సాయంతో అన్నై స్మార్ట్ బ్రెయిలీ డివైజ్‌లను ఉచితంగా పంపిణీ చేశారు.

ఘటమెత్తిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే

ఘటమెత్తిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే