
మహిళలపై దాడులు అరికట్టాలి
జయపురం: రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళ వారం రాత్రి మశాల(దివిటీ) జాతర నిర్వహించారు. కొరాపుట్ మహిళా కాంగ్రెస్ అద్యక్షురా లు నళినీ రథ్ నేృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శశిభూషణ్ పాత్రో తదితరులు పాల్గొన్నారు.
మవులి మా జాతర ప్రారంభం
జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్ శాశనసభ నియోజకవర్గ పరిధి ఛతర్ల గ్రామ పంచాయతీ పటకికుంబ గ్రామం ప్రాంతంలో గల మవులి కోట మందిరంలో మవులి మా జాతర బుధవారం ప్రారంభమైంది. ఈ జాతరలో కొట్‌పాడ్, కుంఽద్ర సమితుల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ జాతరలో ప్రముఖ కాంగ్రెస్ నేత, కొట్‌పాడ్ సమితి మాజీ అధ్యక్షుడు నీలకంఠ పూజారి, మాజీ కౌన్సిలర్‌లు దేవీప్రసాద్ నాయక్, నరేంద్ర మఝి, యువజన కాంగ్రెస్ నాయకుడు కాళీ కృష్ణ తదితరులు అమ్మవారికి పూజలు చేశారు. కమసాయి బిశాయి, బుద్ర సిరా, జగన్నాథ్ గౌడ, రామచంద్ర దురువ, వార్డు మెంబర్ రామ భూమియ తదితరులు మవులి మా జాతరను నిర్వహించారు. ఈ జాతరలో పలు ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రజలు పాల్గొని మవులి మాకు పూజలు చేశారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
జయపురం: పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశా ల జయపురంలో బుధవారం ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించారు. హెచ్‌ఎం ప్రకాశ చంద్ర పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయపురం బ్లాక్ ఎడ్యుకేష న్ ఆఫీసర్ (బీఈఓ)చందన కుమార్ నాయక్ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా డాక్టర్ మ నోజ్ బిశ్వాల్, డాక్టర్ సునీత సాహు పాల్గొన్నా రు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఎటువంటి శ్రద్ధ తీసుకోవా లో, వ్యాధుల నుంచి ఎలా రక్షించుకోవాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్లు వివరించారు. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలన్నారు. విద్యార్థులకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్య సబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హైవేపై అక్రమ వసూళ్లు!
ఇచ్ఛాపురం టౌన్ : మున్సిపాలిటీ పరిధిలోని బెల్లుపడ సమీపంలో పాత టోల్‌గేటు వద్ద అనధికార వ్యక్తులు వ్యవసాయ మార్కెట్ కమిటీ పేరుతో అక్రమ వసూళ్ల దందా సాగిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పేరిట రసీదు బుక్ చూపించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఇంటిగ్రేడ్ చెక్‌పోస్టు ఉన్నప్పుడు అక్రమంగా వస్తువులు రవాణా చేస్తే వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేసేవారు. ఇంటిగ్రేడ్ చెక్‌పోస్టు తొలగించాక అపరాధ రుసుం వసూలు చేయడం ఆగిపోయింది. ప్రస్తుతం మార్కెట్ కమిటీలో కొందరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, తోటపని చేసే వారు హైవేపై వ్యవసాయ ఉత్పత్తుల లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. స్థానికులు, అధికారులు వచ్చే సమయంలో ఏమీ తెలియనట్లు పక్కకు జారుకుంటున్నారు. ఈ విషయమై వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఆంద్రయ్య వద్ద ప్రస్తావించగా గతంలో కవిటి మండలం కరాపాడు టోల్‌గేటు వద్ద లారీలు ఆపి వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే లారీల నుంచి పన్ను వసూలు జరిగేదని, టోల్ గేట్ వారు అభ్యంతరం చెప్పడంతో పాత టోల్‌గేటు వద్దకు మార్చామని చెప్పారు.సూపర్‌వైజర్లు, ఇతర అధికారులే పన్ను వసూలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పెన్షనర్ల సమస్యలపై వినతి
శ్రీకాకుళం అర్బన్: పెన్షనర్‌ల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షు డు సుబ్బరాయన్ పాలంకి, ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చౌదరి పురుషోత్తమనాయుడు, జనరల్ సెక్రటరీ సతీష్‌కుమా ర్ కోరారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రాష్ట్ర సెక్రటేరియేట్‌లో కలిసి వినతిపత్రం అందించారు.
పశువుల పట్టివేత
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం నారాయణవలస సమీపంలో వ్యాన్‌లో 13 ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేర కు కోట బొమ్మాళి ఎస్‌ఐ వి.సత్యనారాయణ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. పశువులను తరలిస్తున్న వ్యాన్‌ను ఆపగా 12 మగదూడలు, ఒక ఆవు ఉన్నట్లు గుర్తించి వాటిని విజయనగరం జిల్లా కొత్తవలస గోశాల కు తరలించారు. అనంతరం ఆవులు అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.

మహిళలపై దాడులు అరికట్టాలి

మహిళలపై దాడులు అరికట్టాలి