
శ్రీక్షేత్రానికి దవనం మొక్కలు
కొరాపుట్: పూరీ క్షేత్రంలో జగన్నాథుడికి ఎంతో ప్రీతిపాత్రమైన దవనం మొక్కలను స్థానిక శబరి శ్రీక్షేత్రం నుంచి పూరీ ఆలయానికి బుధవారం పంపించారు. ఈ మొక్కలతో చేసిన దండలు ప్రతిరోజూ పూరిలో దేవ దేవుళ్లకి వేస్తారు. ఇవి సాధారణ వాతావరణంలో పెరగవు. అందువలన వీటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పూరి క్షేత్రానికి దిగుమతి చేస్తారు. అయితే కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు వీటిని కొరాపుట్‌లో పెంచారు. అవి విస్తారంగా పెరగడంతో పూరీ క్షేత్రం నుంచి పండితులు వచ్చి పరిశీలించారు. వారు ఆమెదం తెలపడంతో పాటు తీసుకుని వెళ్లడానికి ప్రత్యేక వాహనం పంపించారు. దీంతో ఈ మెక్కలను తరలించారు. ఇకపై వీటిని విస్తారంగా పెంచాలని శబరి శ్రీక్షేత్ర కమిటీ నిర్ణయించింది.

శ్రీక్షేత్రానికి దవనం మొక్కలు