
ఫుట్‌బాల్ చాంపియన్‌గా జీబా టైగర్స్
పర్లాకిమిడి: స్థానిక గజపతి స్టేడియంలో ఏప్రిల్ 7వ తేదీ నుంచి జరుగుతున్న జిల్లా స్థాయి సీఎం ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్స్‌లో నువాగడ, జీబా టైగర్స్ మధ్య పోటీ జరిగింది. నువాగడ ఫైటర్స్‌పై నాలుగు పాయింట్ల తేడాతో జీబా టైగర్స్ విజేతగా నిలిచింది. జీబా టైగర్స్‌కు భువనేశ్వర్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్టోర్స్ అకాడమీలో చేర్చి ఫుట్‌బాల్‌లో కోచింగ్ ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తుంది. జీబా టైగర్స్‌లో అందరూ 15 ఏళ్ల వయస్సు గలవారే. జిల్లాలో 8 క్లబ్‌లకు చెందిన క్రీడాకారులు అండర్ 15 గ్రూప్‌లో 176 మంది ఏప్రిల్ 7 నుంచి 13వ తేదీ వరకు ఆడారు. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా ఎస్పీ జితేంద్ర నాథ్ పండా, గౌరవ అతిథి డీఈఓ మాయాధర్ సాహు, విద్యాలయాల పీఈటీ సురేంద్ర పాత్రో హాజరయ్యారు. ట్రోఫీని జీబా టైగర్స్ జట్టుకు ఎమ్మెల్యే అందజేయగా, నువాగడ ఫైటర్స్ జట్టుకు రన్నర్స్ ట్రోఫీని జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ విద్యాలయాల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలలో విద్యాలయాల క్రీడా శిక్షకులు ధర్మేంద్ర సామల్, సంతోష్ పట్నాయక్, ప్రియదర్శి మిశ్రా, రేఖారాణి దేవ్, శివరాం భుయ్యాన్, కె.వి.రెడ్డి, కిశోర్ సామల్ పర్యవేక్షించారు.

ఫుట్‌బాల్ చాంపియన్‌గా జీబా టైగర్స్

ఫుట్‌బాల్ చాంపియన్‌గా జీబా టైగర్స్

ఫుట్‌బాల్ చాంపియన్‌గా జీబా టైగర్స్