ఘనంగా నివాళి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా నివాళి

Apr 15 2025 1:56 AM | Updated on Apr 15 2025 1:56 AM

ఘనంగా

ఘనంగా నివాళి

అంబేడ్కర్‌కు ..

పర్లాకిమిడి:

బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా కొత్త బస్టాండు వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి, ఎస్పీ జితేంద్ర నాథ్‌పండా, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, డీఆర్‌డీఏ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి శంకర్‌ కెరకెటా, సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా, పురపాలక ఈఓ లక్ష్మణ ముర్ము, రాయగడ బ్లాక్‌ శిక్షాధికారి యస్‌.పాపారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టరేట్‌ నుంచి కొత్త బస్టాండు వరకూ మోటారు సైకిల్‌ ర్యాలీ జరిపారు. అనంతరం దండుమాలవీధిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు.

కొరాపుట్‌: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ఘనంగా జరిగింది. సోమవారం కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాలలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మల్కన్‌గిరి: స్థానిక బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి సోమవారం కలెక్టర్‌ ఆశిష్‌ ఈశ్వర్‌ పటేల్‌ పూలమాలాలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్‌ చేసిన కృషిని వివరించారు. స్థానిక శిశుమందిర్‌ పాఠశాలలోనూ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వేద్బ్‌ర్‌ ప్రధన్‌, జిల్లా సబ్‌ కలెక్టర్‌ దుర్యోధన్‌ బోయి, డీపీఐఆర్‌ఓ ప్రమిళ మాఝి, మున్సిపల్‌ అధికారి ఆశోక్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

రాయగడలో..

రాయగడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా యంత్రాంగం పూలమాలలు వేసి నివాళులర్పించింది. జిల్లా అదనపు కలెక్టర్‌ రమేష్‌ చంద్ర నాయక్‌, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్‌ ప్రధాన్‌ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్‌, ఆ పార్టీ నాయకుడు యాల కొండబాబు, బసంత ఉలక, కాళీరాం మాఝి తదితరులు స్థానిక కొత్త బస్టాండు వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గుణుపూర్‌లో సీపీఐ (ఎంఎల్‌) జిల్లా అధ్యక్షుడు తిరుపతి గొమాంగొ ఆధ్వర్యంలో పట్టణలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలిచిన వారికి బహమతులు అందజేశారు.

జయపురం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు వాడవాడలా జరిగాయి. జయపురం సమితి జయంతిగిరి గ్రామంలో జయంతిగిరి కూడలి వద్ద గల అంబేడ్కర్‌ ప్రతిమకు పూల మాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజళి ఘటించారు. జయపురంలో దళిత సమాజ్‌ శ్రేణులు స్థానిక పారాబెడ కూడలిలో ఉన్న డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జయపురం సబ్‌ కలెక్టర్‌ అక్కవరం శొశ్యా రెడ్డి, పుష్పమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఆమెతో పాటు జయపురం ఎడిపిఆర్‌ఓ యశోద గదబ, పలువురు అధికారులు,జయపురం ప్రభుత్వ మహిళా కళాశాల, మహిళా ఉన్నత పాఠశాల విద్యార్ధిణీ విద్యార్ధులు, జయపురం అంబేడ్కర్‌ సమితి కార్యకర్తలు, బిజేపి నేతలు పారాబెడ కూడలి వద్దగల డా,అంబేడ్కర్‌ కు నివాళులు అర్పించారు.

ఘనంగా నివాళి 1
1/2

ఘనంగా నివాళి

ఘనంగా నివాళి 2
2/2

ఘనంగా నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement