ఘనంగా ఉత్కళ నూతన సంవత్సరం
జయపురం: పొణ సంక్రాంతిలో పూజలు అందుకుంటున్న దేవతా మూర్తులు
మల్కన్‌గిరి: మహిళలు చేసిన ఒడియా పిండివంటలను
పరిశీలిస్తున్న అధికారులు
మల్కన్‌గిరి: జగన్నాథ మందిరం వద్ద ఒడియా వంటకాలను
పరిశీలిస్తున్న అధికారులు
రాయగడ: పానకాన్ని పంచుతున్న దృశ్యం
కొరాపుట్: ఉత్కళ ప్రజల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలలో ఉత్కళ కవులు, మేధావులు సదస్సులు, చర్చాగోష్టిలు ఏర్పాటు చేశారు.
రాయగడలో..
రాయగడ: ఒడియా ప్రజల కొత్త సంవత్సరం పొణా సంక్రాంతిని పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో సంఘం కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేక పూజలను నిర్వహించి పొణా (పాణకం) ను పంపిణీ చేశారు. అదేవిధంగా వాకర్స్ క్లబ్, ఇంటర్‌నేషనల్ హుమన్ రైట్స్ కౌన్సిల్ కు చెందిన సభ్యులు పొణాను పంపిణీ చేశారు.
మల్కన్‌గిరిలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో ఒడియా పక్షోత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన సోమవారం ఒడియా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. జిల్లా అనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రధాన్ మాట్లాడుతూ పక్షోత్సవంలో చివరి రోజు మన ఒడియా నూతన సంవత్సరం కావడం విశేషమన్నారు. ఈ సందర్భంగా కొన్ని వంటకాలను ప్రదర్శించారు. స్థానిక జగన్నాథ మందిరంలో ఆదివారం ఆహార దినోత్సవం నిర్వహించారు.
జయపురంలో..
జయపురం: ఒడియ సంప్రదాయ ప్రజల కొత్త సంవత్సరం పొణ సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి ప్రతి ఇంటివారు దేవతలకు పూజలు భక్తి శ్రద్దలతో జరిపారు.
ఘనంగా ఉత్కళ నూతన సంవత్సరం
ఘనంగా ఉత్కళ నూతన సంవత్సరం
ఘనంగా ఉత్కళ నూతన సంవత్సరం


