రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పర్యటన
రాయగడ: రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్, ప్రభుత్వ కార్యదర్శి అరవింద్ అగర్వాల్ జిల్లాలో పర్యటించారు. శుక్రవారం ఆయన జిల్లాలోని కై లాస్‌పూర్, కొలనారలో గల ఉన్నత పాఠశాలల్లో పర్యటించి అక్కడ గల విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమీక్షించారు. అనంతరం రామనగుడలో పర్యటించిన ఆయన అక్కడ రైతులు పండిస్తున్న గులాబీ పూల తోటలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమితిలో పసుపు, చింతపండు యూనిట్లను నిర్వహిస్తున్న రైతులతో ముచ్చటించారు. వారికి సరైన ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. అనంతరం రాయగడ అటానమస్ కళాశాలలో పర్యటించిన అగర్వాల్ కు ప్రిన్సిపాల్ సరస్వతి రే, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
మజ్జిగ వితరణ
రాయగడ: మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాల్లో స్థానిక మహిళా క్లబ్ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు శుక్రవారం మజ్జిగ పంపిణీ చేశారు. మందిరం ప్రాంగణంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాల్లో మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టినట్లు, క్లబ్ కార్యదర్శి కస్తూరి సాహు, కోశాధికారి సీహెచ్ ఇతిశ్రీ, అల్కాదాస్, బి.లక్ష్మీలు తెలియజేశారు.


