భూగర్భంలో దొరికిన రాముడి ప్రతిమ
భువనేశ్వర్: భూగర్భంలో శ్రీరాముని కాంస్య విగ్రహం బయటపడింది. ఈ సంఘటనతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది. కటక్ జిల్లా బంకి మండలం రొత్తాగొడొ గ్రామంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన బలరామ్ రౌత్ వివరించిన కథనం ప్రకారం శుక్రవారం రాత్రి అతనికి రల వచ్చింది. ఆ ప్రకారం అతను తన కలలో చూసిన ప్రదేశంలో శనివారం తవ్వి వెతకడంతో విగ్రహం బయటపడింది. ఈ వెలికితీతలో అతనికి రాముడి కాంస్య విగ్రహం కనిపించింది. ఈ సమాచారం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. స్థానికులు రామ నవమి సందర్భంగా భగవంతుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రణాళిక వేశారు. ప్రతిమ దొరికిన ప్రదేశం యజమాని దిబాకర్ మల్లిక్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.


