
అలరించిన షణ్ముఖ శర్మ ప్రవచనాలు
పర్లాకిమిడి: కాశీనగర్ సమితి రాణిపేట గ్రామంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖశర్మచే మహాభారతంలో భీష్మాచారుని బోధ ప్రవచనములు సోమవారం నుంచి చెబుతున్నారు. మహాభారతంలో లేనిది ఎక్కడా లేదని, ప్రపంచమంతా ఉన్నది ఈ మహాభారతంలోనే.. అని ఆయన తన ప్రవచనాలలో అన్నారు. దేబాబ్రతుడు తదనంతరం తన తల్లి గంగ వద్ద కురువంశం రక్షిస్తానని మాట ఇచ్చిన మేరకు ప్రతిజ్ఞ చేయడంతో భీష్మునిగా పేరుగాంచాడని అన్నారు. పర్లాకిమిడిలో క్రిష్ణచంద్ర గజపతి కళాశాలలో ఎంఏ తెలుగు విద్యాభ్యాసం చేసిన సామవేదం షణ్ముఖ శర్మ అందరికీ సుపరిచితుడు. ఆయన తండ్రి కీ.శే.సామవేదం రామమూర్తి శర్మ తెలుగు పండిట్‌గా పనిచేస్తూ ప్రవచనములు చెబుతుండేవారు. తెలుగు ీచిత్ర సీమలో అనేక సినిమాలకు పాటల రచయితగా కూడా కొంతకాలం పనిచేశారు. అనతి కాలంలో తెలుగు చిత్రసీమకు స్వస్తి పలికిన సామవేదం షణ్ముఖ శర్మ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనములు చెబుతూ ఎలలేని ఖ్యాతిని ఆర్జించారు. ఈ కార్యక్రమం ధన్వంతరి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 11వతేదీ వరకూ జరుగుతుందని చిరంజీవులు తెలియజేశారు.

అలరించిన షణ్ముఖ శర్మ ప్రవచనాలు