
వనదుర్గా మందిరంలో బుద్ధుని విగ్రహ ప్రతిష్ట
పర్లాకిమిడి:
స్థానిక దుర్గంపేటలో వనదుర్గా మందిరం ఆవరణలో శుక్రవారం బుద్ధుని విగ్రహాన్ని చంద్రగిరి టిబెటియన్ శరణార్థుల గురూజీ ఖెంపో పెమా ప్రతిష్టించారు. శాంతికి చిహ్నం బుద్ధుడు అని, ఈ ప్రాంతంలో బుద్ధ విగ్రహం ప్రతిష్టించడంతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని అన్నారు. తొలుత టిబెటియన్ మతగురు దలైలామా శిష్యులు లామా గెలక్, ఖెంపో పెమా గురూజీలను పట్టణంలో మార్కెట్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ఊరేగించారు. అనంతరం కండ్రవీధి వద్ద దుర్గంపేటలో నూతన వనదుర్గా మందిరం ఆవరణలో నిర్మించిన బుద్ధుని విగ్రహాన్ని మంత్రోచ్ఛరణ చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ లామాలు తెసిరింగ్, బయాంగ్, లోపోన్ సోనమ్ గ్యంస్తో, నోర్బు, లోపోన్ పసాంగ్ దోర్జి మరో ఎనిమిదిమంది బౌద్ధ తీర్ధాంకుల సహకారంతో మంత్రోచ్ఛరణ చేసి పవిత్ర జలాలను విగ్రహంపై జల్లారు. అనంతరం బుద్ధుని విగ్రహాన్ని లాంఛనంగా గురూజీ ఖెంపోసెమా ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఖెంపో పెమా గురుజీ, లామా గెలక్‌ను వనదుర్గా ఆలయ కమిటీ తరపున బౌధ్ధ చిత్రాన్ని బహుకరించి, దుశ్శాలువతో సత్కరించారు.

వనదుర్గా మందిరంలో బుద్ధుని విగ్రహ ప్రతిష్ట

వనదుర్గా మందిరంలో బుద్ధుని విగ్రహ ప్రతిష్ట