
సన్మార్గంలో నడవాలి
పర్లాకిమిడి: ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలని ఆధ్యాత్మిక ప్రవచనకారుడు సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. నగరంలోని రాజవీధి రామలింగేశ్వర ఆలయంలో శనివారం పొడుగుకోవెల ఆలయ కమిటీ ప్రతినిధి దుర్గాప్రపాద్ దాస్, కన్యకాపరమేశ్వరి ఆలయం అర్చకులు వనమాలి మణిశర్మ, లలితా దేవి ఆలయం భక్తబృందం ఆధ్వర్యంలో సామవేదం షణ్ముఖ శర్మకు సత్కారం చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ శంకరుడు, పార్వతీదేవి, లలితాదేవి అందరూ ఒక్కటేనని చెప్పారు. కార్యక్రమంలో లలితాదేవి భక్త బృందం కమిటీ అధ్యక్షురాలు విశాలాక్ష్మీ అయ్యంగర్, బరాటం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పిడుగు పడి ఇల్లు దగ్ధం
జయపురం: కాలవైశాఖి ప్రభావంతో జయపురంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, పిడుగులతో జనం భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం స్థానిక గొడియ మాలి వీధిలో ప్రశాంత్ అనే వ్యక్తి ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయుడయ్యాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని స్థానికులు కోరారు.
18 క్వింటాళ్ల ఇప్పపూలు పట్టివేత
మల్కన్‌గిరి: కోరుకొండ సమితి ఎం.వి.53 గ్రామంలో శనివారం ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించి 18 క్వింటాళ్ల ఇప్పపూలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన వికాష్ బాణిక్, హరధన్ బాణిక్‌లను అరెస్టు చేశారు. నాటుసారా తయారీ కోసం ఇప్పపూలు వినియోగిస్తారని పోలీసులు తెలిపారు.

సన్మార్గంలో నడవాలి

సన్మార్గంలో నడవాలి