జయపురం: జయపురం సమితి నుంచి81 మంది వయో వృద్ధులు సోమవారం ఉదయం జయపురం సమితి కార్యాలయం నుంచి అయోధ్య, వారణాసి తీర్థ యాత్రలకు బయలు దేరారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ ఆదేశాల మేరకు జయపురం బీడీవో శక్తి మహాపాత్రో జయపురం సమితిలోని 22 పంచాయతీలకు చెందిన 81 మంది వయోవృద్ధులను ఎంపిక చేసి వారిని సమితి కార్యాలయానికి రప్పించారు. వారు సోమవారం ఉదయం బస్సులలో జయపురం నుంచి కొరాపుట్ కలక్టరేట్ సమీపంలో గల సాంస్కృతిక భవనానికి వెళ్లారు. వరిష్ట నాగరిక తీర్థ యాత్ర యోజనలో (వయో వృద్ధుల తీర్థ యాత్ర పథకం) 2025లో వారిని అయోధ్య, వారణాశి పుణ్య క్షేత్రాలు దర్శించేందుకు తీర్థ యాత్రలకు పంపుతున్నట్లు బీడీవో వెల్లడించారు. కొరాపుట్‌లో వారందరికీ జిల్లా వైద్యాధికారులచే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బస్సులలో రాయగడ తీసుకెళ్తారు. రాయగడ నుంచి వారంతా మంగళవారం వారణాశి, అయోధ్యల తీర్థ యాత్రలకు రైలులో బయలు దేరుతారని వెల్లడించారు. తీర్థ యాత్రలకు వెళ్తున్న వారి బాగోగులు చూసేందుకు సమితి సామాజిక సురక్షా అధికారిని తోడుగా పంపుతున్నట్లు వివరించారు.
జయపురం మున్సిపాలిటీ నుంచి 18 మంది..
తీర్థ యాత్రల కోసం జయపురం మున్సిపాలిటీ నుంచి 18 మంది వృద్ధులను కొరాపుట్ పంపినట్లు జయపురం మున్సిపాలిటీ సహాయ కార్యనిర్వాహక అధికారి కృతిబాస సాహు వెల్లడించారు.
మల్కన్‌గిరి జిల్లా నుంచి వృద్ధులు పయనం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా నుంచి కూడా 75 మంది వృద్ధులు తీర్థయాత్రలకు రెండు బస్సుల్లో సోమవారం బయలుదేరి వెళ్లారు. బస్సులను మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ తీర్థ యాత్రలకు వెళ్తున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధన్, వేద్బ్‌ర్ ప్రధన్, జిల్లా సామజిక భద్రతా అధికారి సస్మీత స్వైయి, ఇతర అధికారులు ఉన్నారు.
● పక్కా ఏర్పాట్లు చేసిన అధికారులు
తీర్థ యాత్రలకు వయోవృద్ధులు పయనం
తీర్థ యాత్రలకు వయోవృద్ధులు పయనం
తీర్థ యాత్రలకు వయోవృద్ధులు పయనం
తీర్థ యాత్రలకు వయోవృద్ధులు పయనం


