
వైన్‌షాప్ నిర్వాహకుడిపై దాడి
మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టిలోని ఓ మద్యం షాపు నిర్వాహకుడిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చాపర గ్రామానికి చెందిన కొందరు యువకులు మెళియాపుట్టిలోని మద్యం షాపులో నాలుగు బాటిళ్లు కొనుగోలు చేసి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి ఒక మద్యం బాటిల్ తిరిగి నిర్వాహకుడికి ఇచ్చి డబ్బులు అడిగారు. అందుకు ఆయన నిరాకరించడంతో వాగ్వాదానికి దిగారు. మద్యం మద్యం మత్తులో నిర్వాహకుడిపై దాడికి దిగి సీసాతో తలపై బలంగా మోదారు. అనంతరం పిడిగుద్దులతో దాడి చేశారు. నిర్వాహకుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నలుగురు యువకులపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు.
నిమ్మ @ రూ.110
శ్రీకాకుళం: వేసవి ఎండల నేపథ్యంలో జిల్లాలో నిమ్మకాయల ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. నెల రోజుల క్రితం రూ.50 నుంచి రూ.60 వరకు ఉన్న కిలో నిమ్మకాయల ధర ప్రస్తుతం రిటైల్‌లో రూ.110కు అమ్ముతున్నారు. హోల్‌సేల్‌లో రూ.95 వరకు ధర పలుకుతోంది. వేసవిలో నిమ్మకాయల వినియోగం ఎక్కువగా ఉండటంతో ధర పెరగడం పరిపాటి. ఏటా ఏప్రిల్ మాసాంతం నుంచి జూన్ మొదటి వారం వరకు ధర పెరుగుతునే ఉంటుంది. ఈ ఏడాది మాత్రం మార్చి చివరి వారం నుంచి ధర విపరీతంగా పెరిగిపోయింది. జిల్లాలో నిమ్మ పంట అంతంతమాత్రంగానే సాగవుతోంది. గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నిమ్మ దిగుమతి అవుతోంది. ఆయా ప్రాంతాల్లో ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగా పడటం, మంచు ఎక్కువగా కురవడం వల్ల దిగుబడి తగ్గిపోయిందని, ఫలితంగా ధర పెరిగిపోయిందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. మే చివరి నాటికి కిలో నిమ్మ ధర రూ.150 దాటిపోవచ్చని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వైన్‌షాప్ నిర్వాహకుడిపై దాడి