
వైభవంగా భక్తిసంగీత విభావరి
పర్లాకిమిడి: స్థానిక రాజవీధి అర్బన్ బ్యాంకు గ్రౌండ్స్‌లో శనివారం రాత్రి భక్తి సంగీత సంసద్ ఆధ్వర్యంలో 45వ భజన సమారోహన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఎస్పీ జితేంద్రనాథ్ పండా, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, మహాంత రామానంద దాస్‌జీ, ఉపాధ్యక్షులు ప్రదీప్ నాయక్, భరత్ భూషణ్ మహంతిలు అతిథులుగా విచ్చేశారు. ఒడియా సినీ సంగీత దర్శకులు ప్రశాంత్ పాఢి, గాయకులు శుభజ్యోతి, ప్రభుప్రశాంత్ మహంతి, స్వస్థిక్ పాఢి తదితరులు జగన్నాథ భక్తి సంగీత గేయాలను శ్రావ్యంగా ఆలపించి శ్రోతలను అలరించారు. హార్మోనిస్టు కై లాస్ చంద్ర పట్నాయిక్, ఉపాధ్యాయులు మనోజ్ పట్నాయిక్, ప్రసన్న కుమార్ రథ్, తిరుపతి పండా, అర్చనా రోథో తదితరులకు ఎమ్మెల్యే చేతులమీదుగా అవార్డులు అందజేశారు. గౌరీ ప్రసాద్ రథ్, ఎస్.ఎన్.రథ్ తదితరులు పర్యవేక్షించారు.

వైభవంగా భక్తిసంగీత విభావరి

వైభవంగా భక్తిసంగీత విభావరి