ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురికి గాయాలు
మల్కన్‌గిరి: ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి సుదకొండ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో చోటుచేసుకుంది. సుదకొండ గ్రామానికి చెందిన భీమా మాడ్కమి, లక్ష్మి పడియమి, దివన్ మాడీ, భీమ పోడియామి, రామా మడ్కమి సమీపంలోని అడవిలో కట్టెలు కొట్టి తిరిగి వస్తుండగా మధ్యలో ట్రాక్టర్ రావడంతో దాన్ని ఎక్కారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత ట్రాక్టర్ బోల్తాపడడంతో అదుపు తప్పి పడిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు గాయపడ్డారు. వారిని స్థానికుల సహయాంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. వీరిలో లక్ష్మికి తీవ్రంగా గాయాలు కావడంతో మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. కలిమెల ఐఐసి చంద్రకాంత్ తండి ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురికి గాయాలు


