
కన్నుల పండువగా తెప్పోత్సవం
పొందూరు: మండల పరిధిలోని లైదాం శ్రీరామధామంలో సీతారాముల మహాయజ్ఞంలో భాగంగా తెప్పోత్సవం కార్యక్రమం శనివారం రాత్రి 7 గంటలకు కన్నుల పండువగా నిర్వహించారు. తొలుత సీతారామ చంద్రప్రభువుల వారికి రథోత్సవం చేపట్టారు. వారిని పల్లకిలో గ్రామంలో ఊరేగించారు. మహిళలు హారతులు పట్టి పూజలు చేశారు. అనంతరం కొలనులో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు.
చిక్కోలుకు వన్నెతెచ్చిన ‘గాయకుడు ఆనంద్’
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం జిల్లాకు వన్నెతెచ్చిన వ్యక్తి సినీ గాయకుడు జి.ఆనంద్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్ ప్రాంగణంలో ఘంటసాల, బాలు, జి.ఆనంద్ (జీబీఏ) స్వరమాధురి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ, ఆనంద్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆనంద్ విగ్రహాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి దివిలి హేమచందర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, గొండు స్వాతి, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, డాక్టర్ నిక్కు అప్పన్న, గేదెల వీర్రాజు, వావిలపల్లి జగన్నాథం నాయుడు, డోల జగన్, ఎం.వి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా తెప్పోత్సవం